Petrol: షాకింగ్ న్యూస్.. 15 రోజుల్లో పెట్రోల్ బంక్‌లు బంద్..!
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొంది. ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో పలు దేశాలు కొనలేకపోతున్నాయి. ఇండియాలో కూడా అప్పట్లో పెట్రోల్, డిజిల్ ధరలు పెంచారు. అయినప్పటికీ ఆయిల్ కంపెనీలకు లాస్ వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే భారత వద్ద వ్యూహాత్మక చమురు నిల్వలు ఉన్నాయి. దీంతో మిగతా దేశాల కంటే ఇండియాలో ముడి చమురు ధరలు ప్రభావం తక్కువగా ఉంది. కానీ దాయాది దేశం పాకిస్థాన్ తీవ్ర ఇంధన సంక్షోభం నెలకొంది. అసలే అంతంత మాత్రంగా ఉన్న పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి మరింతగా దారుణంగా మారింది. ప్రజలు నిత్యావసరాల ధరలు పెరిగి తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.
ఇప్పుడు పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా అక్కడి ప్రజల పరిస్థితి మరింత దిగజారింది. ఇక చమురు నిల్వల కొరత కారణంగా పాకిస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లను ఎప్పటికప్పుడు పెంచుతూనే ఉంది. అయినప్పటికీ అక్కడి ఆయిల్ కంపెనీలకు నష్టాలు వస్తున్నాయి. భారీ నష్టాలు వస్తున్నట్లు డీలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక పాకిస్థాన్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకులను బంద్ చేస్తామని హెచ్చరించింది. 15 రోజుల్లోగా తమ సమస్యలు పరిష్కరించాలని డెడ్ లైన్ విధించింది.

ప్రభుత్వం ఇలా పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతి రోజూ మార్చకుండా 30 రోజులకోసారి మాత్రమే మార్చే విధంగా పాలసీని తీసుకురావాలని డీలర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. పెట్రోల్ బంకులు నిర్వహించే యజమానులకు ఇప్పుడు వస్తున్న కమిషన్ ను 8 శాతానికి పెంచాలని కోరింది. లేకుండా పెట్రోల్ బంకులు పూర్తి స్థాయిలో మూసివేస్తామని హెచ్చరించింది. పెట్రోల్, డీజిల్ ధరలు నిర్ణయించేటప్పుడు ఆయిల్ యాజమాన్యాలను సంప్రదించాలని డిమాండ్ చేసింది. పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించిన ధరలను నియంత్రించే అధికారం ప్రభుత్వం వద్దే ఉండాలని స్పష్టం చేసింది. ఒక వేళ పాక్ లో పెట్రోల్ బంక్ లు బంద్ చేస్తే తీవ్ర సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంటుంది.
దీనిపై ఆ దేశ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. పాక్ ఉగ్రవాదాన్ని వీడితేనా అభివృద్ధి సాధ్యం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. భారత్ నుంచి విడిపోయిన పాకిస్తాన్ అప్పటి నుంచి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూనే ఉంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications