SBI: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారుల వివరాలు లీక్ అయ్యాయా..!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారుల వివరాలు హ్యాక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. "సిరియస్ఇమ్" అనే ఒక అనామక హ్యాకర్ల బృందం హ్యాక్ చేసినట్లు ప్రముఖ సైబర్ సెక్యూరిటీ ఎకౌంట్ 'సైబర్పల్స్56' ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఈ హ్యాక్ వల్ల దాదాపు 3.75 లక్షల మంది SBI కస్టమర్ల గోప్యమైన డేటా బహిర్గతమయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. హ్యాకర్ల వద్ద హ్యాకర్ల దగ్గర సుమారు 3లక్షల 75వేల అకౌంట్లకు సంబంధించిన వివరాలతో పాటు 2వేల722 పీడీఎఫ్ ఫైల్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హ్యాకర్ల బృందం తమ వాదనలను డార్క్ వెబ్ ఫోరమ్ అయిన బ్రీచ్ఫోరమ్స్లో చేసింది. ఈ ఆరోపణలపై ఎస్బీఐ స్పందించలేదు.
సిరియస్ఇమ్ నాలుగు నమూనా కస్టమర్ రికార్డులని పేర్కొంటూ పత్రాలను ప్రచురించింది. దీనితో పాటు, తమకు వ్యక్తిగత కస్టమర్ సమాచారం, రుణ దరఖాస్తులు, సహాయక పత్రాలకు యాక్సెస్ ఉందని ఈ హ్యాకర్ల బృందం పేర్కొంది. ఈ డేటాసెట్‌లో నో యువర్ కస్టమర్ (KYC) రికార్డులు, ఆధార్ నంబర్లు, ఖాతా తెరిచే ఫారాలు మరియు నివాస చిరునామాలు ఉండవచ్చు. ఈ డేటా కొత్తదా లేక గతంలో జరిగిన లీక్‌ల నుంచి తిరిగి ఉపయోగించబడిందా అనేది కూడా అస్పష్టంగా ఉంది. ఈ డేటా లీక్‌లో ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం, లోన్ అప్లికేషన్లు, వాటికి సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్, అకౌంట్ ఓపెనింగ్ దరఖాస్తులు, చిరునామాలు వంటి అత్యంత కీలకమైన వివరాలు ఉన్నట్లు సైబర్పల్స్56 తెలిపింది.

ఇది ఈ డేటాకు సంబంధించి మొదటి లీక్ మాత్రమేనని హ్యాకర్లు పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఈ లీకైన డేటా ఎంతవరకు నిజం, దీని మూలాలు ఎక్కడివి అనే అంశాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ ఈ సమాచారం గనుక నిజమైతే, సైబర్ నేరగాళ్లు దీనిని ఉపయోగించి మోసపూరిత లోన్ దరఖాస్తులు చేయడం, ఐడెంటిటీ థెఫ్ట్, ఆర్థిక మోసాలు, టార్గెటెడ్ ఫిషింగ్ దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. గతంలో భారతదేశంలో బ్యాంకు డేటా ఉల్లంఘన కేసులు జరిగాయి. జూలైలో బ్యాంక్ ఆఫ్ బరోడా 1TB కస్టమర్ డేటాను బహిర్గతం చేసిన డేటా లీక్‌ను అంగీకరించింది. గత సంవత్సరం ఎస్బిఐ యోనో (Yano) యాప్‌లో ఒక లోపం కనుగొన్నారు. దానిని తరువాత ఒక అప్డేట్ ద్వారా సరిదిద్దారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications