Youtube Vs Bilibili: యూట్యూబ్‌కు షాక్ .. పోటీగా బిలిబిలి వచ్చేస్తోంది..!
వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ యూట్యూబ్ కు పోటీగా చైనా అతిపెద్ద వీడియో-షేరింగ్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన బిలిబిలి(Bilibili) వస్తోంది. క్రియేటర్ల యూట్యూబ్ ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే బిలిబిలి ప్లాట్‌ఫామ్‌లో అనధికారికంగా కంటెంట్ పోస్ట్ చేస్తున్నారు. బిలిబిలి ప్రస్తుతానికి ఇండియాలో లేకున్నా త్వరలో అడుగు పెట్టే అవకాశం కనిపిస్తోంది. యూట్యూబ్ కఠిన నిబంధనల నేపథ్యంలో చాలా మంది కంటెంట్ క్రియేటర్లు బిలిబిలి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. బిలిబిలి కంపెనీ కూడా తన నెట్ వర్క్ ను విస్తరించాలని భావిస్తోంది.ఈ సంస్థ చైనా దాటి చురుకుగా విస్తరిస్తోంది.
బిలిబిలి ప్రతి 1,000 వీక్షణలకు క్రియేటర్లకు సుమారు $0.70 (దాదాపు రూ. 60) అందిస్తున్నట్లు సమాచారం. అంతర్జాతీయంగా యూట్యూబ్‌కు సవాలు విసరాలని చూస్తున్న ఈ సంస్థ, ఈ చర్య ద్వారా కంటెంట్ క్రియేటర్లను ఆకర్షించడంలో సహాయపడవచ్చని నిపుణులు భావిస్తున్నారు. గ్లోబల్ టైమ్స్ ప్రకారం బిలిబిలి తన అంతర్జాతీయ వెర్షన్‌లో తప్పనిసరి గుర్తింపు ధృవీకరణ లేకుండా మరింత సులభమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ, మరింత స్థానికీకరించిన వినియోగదారు అనుభవం, విదేశీ ప్రేక్షకులకు అనుగుణంగా అదనపు ఫీచర్లు ఉంటాయని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రియేటర్లను ఆకర్షించడానికి బిలిబిలి అంతర్జాతీయ మానిటైజేషన్ అవకాశాలను కల్పిస్తోందని తెలుస్తోంది.

బిలిబిలి ప్లాట్‌ఫామ్ చైనాలో 2009లో ప్రారంభమైంది. తొలుత యానిమే, కామిక్స్, గేమింగ్ కంటెంట్‌తో వచ్చిన ఈ బిలిబిలి.. ప్రస్తుతం టెక్నాలజీ, ఎంటర్‌టైన్‌మెంట్, లైఫ్‌స్టైల్, నాలెడ్జ్ వంటి విభిన్న రంగాలకు విస్తరించింది. 2025 మూడో త్రైమాసికం నాటికి దీనికి 37.6 కోట్ల మంత్లీ యాక్టివ్ యూజర్లు ఉన్నట్లు తెలిసింది. వినియోగదారులు రోజుకు సగటున 112 నిమిషాలు ఇందులో గడుపుతున్నారని కంపెనీ చెప్పుకుంటోంది. ఇది ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే వెబ్‌సైట్‌లలో ఒకటిగా నిలిచింది. యూట్యూబ్ స్టార్ మిస్టర్‌బీస్ట్ 2024లో బిలిబిలిలో కంటెంట్‌ను పోస్ట్ చేసి 8.8 మిలియన్ల మంది ఫాలోవర్లను సంపాదించారు.
బిలిబిలి క్రియేటర్ మానిటైజేషన్‌ను అందిస్తున్నప్పటికీ, దాని అడ్వర్టైజింగ్ ఎకోసిస్టమ్, క్రియేటర్ ఫండ్ ఇప్పటికీ యూట్యూబ్ కంటే చిన్నవిగా ఉన్నాయని, ఇది కొంతమంది క్రియేటర్ల ఆదాయాన్ని పరిమితం చేసే అవకాశం ఉందని కొంతమంది వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు. ఈ బిలిబిలి ఇండోనేసియా, ఫిలీప్పీన్స్, థాయ్‌లాండ్, వియత్నాం, సింగపూర్, మలేసియా వంటి దేశాలకు విస్తారించారు. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఇంటర్నేషనల్ యాప్‌ను కూడా తీసుకొచ్చినట్లి తెలిసింది. త్వరలో మరికొన్ని దేశాలకూ విస్తరిస్తామని కంపెనీ ప్రకటించింది. ఇండియాకు కూడా త్వరలోనే బిలిబిలి వచ్చే అవకాశం ఉంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
