Gold News: లోహాలలో బంగారానికి ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ఆర్థిక వ్యవస్థ పతనమవుతున్న సమయంలోనూ బంగారాన్ని స్థిరమైన అసెట్‌గా పరిగణిస్తారు. దీంతో ఇందులో వివిధ రూపాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. దేశీయంగా గోల్డ్ డిమాండ్ ను తీర్చడంతోపాటు బంగారం దిగుమతి కోసం విలువైన విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చించడం ఇష్టం లేని భారత ప్రభుత్వం.. గతంలో కీలక నిర్ణయం తీసుకుంది. సావరిన్ గోల్డ్ బాండ్స్ ప్రవేశపెట్టింది. కాగా ఇప్పుడు దానిపై నీలినీడలు కమ్ముకున్నాయి.
కేవలం ఇన్వెస్ట్‌మెంట్ కోసం మాత్రమే బంగారం కొనుగోలు చేసే వారికి ఇదొక వరంలా మారింది. ఎందుకంటే 8 ఏళ్ల లాకింగ్ పీరియడ్ ముగిసిన అనంతరం అప్పటికి పెరిగిన ధరను కేంద్ర ప్రభుత్వమే బాండ్ హోల్డర్లకు చెల్లిస్తుంది. ఆ వ్యవధిలో ఇందుకు అదనంగా ఏటా 2.5 శాతం వడ్డీని కూడా వారి బ్యాంక్ ఖాతాలకు జమ చేస్తుంటుంది. దొంగల భయం మరియు వడ్డీరేట్ల తగ్గుదల లేకపోవడం, ఏకంగా భారత ప్రభుత్వమే గ్యారెంటీ ఉంటూ పన్ను మినహాయింపు కూడా కలిగి ఉండటంతో ప్రజలు ఈ స్కీం వైపు పెద్దఎత్తున ఆకర్షితులయ్యారు. పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు.

అయితే మొదట్లో ఇది బాగానే ఉన్నా.. రానురాను ప్రభుత్వానికి తలకు మించిన భారంగా తయారైంది. బంగారం రేట్లు రాకెట్ స్పీడ్ తో ఎగిసిపడుతుండటంతో తక్కువ ధరల వద్ద బుక్ చేసుకున్న వారికి వందల రెట్లు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. ఇది లాభసాటి కాదని గుర్తించిన సర్కార్.. ఈ స్కీంను తప్పించాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొదటగా 2015 లో 2 వేల 684 వద్ద వినియోగదారులు SGBలను కొనుగోలు చేశారు. ఆ బాండ్స్ కాలపరిమితి ముగిసిన అనంతరం ప్రభుత్వం 6 వేల 132 చొప్పున చెల్లించాల్సి వచ్చింది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు బంగారం ధరలు 180 శాతం పెరిగాయి. ప్రస్తుతం ఇదే కేంద్ర ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది.
ఇప్పటివరకు ప్రభుత్వం 67 సార్లు SGBలను రిలీజ్ చేసింది. వీటిలో ఇన్వెస్ట్ చేసి పూర్తి 8 ఏళ్లపాటు ఉంచిన వారు దాదాపు రెట్టింపు రిటర్నులను పొందారు. అయితే 5 ఏళ్ల తర్వాత కూడా మధ్యలోనే వీటి నుంచి బయటకు వెళ్లేందుకు కూడా సర్కారు అవకాశం కల్పించింది. బాండ్లు జారీ టైంలో బంగారం ధరను RBI నిర్ణయిస్తుంది. కాల పరిమితి ముగిసిన అనంతరం ఇండియన్ బులియన్, జ్యూయలరీ అసోసియేషన్ ధరల ఆధారంగా చివరి 3 రోజుల యావరేజ్ తీసుకుని బాండ్ హోల్డర్లకు ప్రభుత్వం చెల్లింపులు చేస్తుంది.


Click it and Unblock the Notifications