LPG Cylinder: గ్యాస్ వినియోగదారులకు షాక్.. వారికి నిలిచిపోనున్న సిలిండర్ల సరఫరా..!
దేశంలోని ఆయిల్ కంపెనీలో ఎల్బీజీ కనెక్షన్ ఉన్నవారు ఇకేవైసీ చేసుకోవాలని సంవత్సర కాలంగా చెబుతూ వస్తున్నారు. ఎల్పీజీ ఇకేవాసీ గడువు ఆగస్ట్ 16న ముగియగా.. దాన్ని ఆగస్ట్ 23 వరకు పొడగించారు. ఆ గడువు ఆదివారంతో పూర్తి అయింది. దీంతో ఎవరైతే ఎల్పీజీ కనెక్షన్ ఇకేవైసీ చేసుకోలేదో వారికి సిలిండర్లు సరఫరా బంద్ కానుంది. వారు ఒక వేళ ఇప్పుడు ఇకేవైసీ చేసినా.. సిలిండర్లు వచ్చే గ్యారెంటి లేదని తెలుస్తోంది. అయితే చాలా మంది చివరి నిమిషంలో ఇకేవైసీ చేసుకోవడానికి గ్యాస్ ఎజెన్సీలకు పరుగులు తీశారు. దీంతో సర్వర్లు బిజీగా మారాయి. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎల్‌పీజీ ఈ-కేవైసీ పూర్తి చేసేందుకు ఇచ్చిన గడువు ముగియడంతో సబ్సిడీ ఆగిపోయే ప్రమాదం ఉందని భయపడుతున్నారు.
గడువును పెంచాలని కస్టమర్లు కోరుతున్నప్పటికీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మాత్రం గడువు పొడగించలేదు. ఈ ప్రక్రియ పూర్తి చేయని వారికి ఆగస్టు 24 నుంచి సిలిండర్ బుకింగ్స్, సబ్సిడీ నిలిచిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇండియన్ ఆయిల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ వంటి ప్రధాన ఆయిల్ కంపెనీలు ఎల్‌పీజీ ఈ-కేవైసీ పూర్తి చేయడానికి ఇచ్చిన గడువు ఆగస్టు 23తో ముగిసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 31 వరకు గడువును మళ్లీ పెంచాలని కస్టమర్లు, డీలర్లు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కంపెనీల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఇప్పటికే చాలా మంది వినియోగదారులకు సిలిండర్లు బుక్ కావడం లేదు.

బుక్ చేస్తుంటే.. ప్లీజ్ కంప్లిట్ యువర్ ఇకేవైసీ వస్తుందని కొంత మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కాగా ఇ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయని వినియోగదారులకు గ్యాస్ సబ్సిడీ నిలిపివేస్తామని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. కస్టమర్ల ఖాతాలోకి వచ్చే నగదు బదిలీ ఆగడమే కాకుండా కొత్తగా సిలిండర్ బుక్ చేసుకోవడం కూడా కష్టంగా మారే అవకాశం ఉందని పలు ఏజెన్సీలు చెబుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ధరలు పెరగకపోయినప్పటికీ సబ్సిడీ ఆగిపోతే పేద, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
అయితే సబ్సిడీ రాక పోయిన ఫర్వాలేదు.. సిలిండర్ బుక్ అయితే చాలని చెబుతున్నారు. ఇకేవైసీ చేసుకుంటేనే సిలిండర్ బుక్ అవుతుందని డీలర్లు స్పష్టం చేస్తు్ననారు. ఇక దేశంలో అత్యధికంగా
పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే 87 శాతం మంది బయోమెట్రిక్ ఇ-కేవైసీ పూర్తి చేసినట్లు చెబుతున్నారు. అక్కడ దాదాపు 2.7 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇకేవైసీ చేసుకోవడానికి ఏజెన్సీల వద్ద వెళ్లాల్సిన అవసరం లేకుండే మొబైలో ఫోన్ లో చేసుకోవచ్చు. మీరు మీ గ్యాస్ కనెక్షన్ కంపెనీ బట్టి యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. తర్వాత ఆధార్ ఆర్డీ యాప్ కూడా డౌన్ లోడ్ చేసుకుని ఇకేవైసీ పూర్తి చేసుకోవచ్చని చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications