LIC: పాలసీదారులకు షాకిచ్చిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా..!
దేశంలోని అతిపెద్ద ఇన్సూరెన్స్ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పాలసీదారులకు షాకిచ్చింది. పాలసీ ప్రీమియం పేమెంట్ కు సంబంధించి ఎల్ఐసీ కీలక నిర్ణయం తీసుకుంది. తన అధికారిక వెబ్‌సైట్ కస్టమర్ పోర్టల్‌లో ఇన్సూరెన్స్ ప్రీమియంలను క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించే సదుపాయం తీసివేసింది. దీంతో క్రెడిట్ కార్డులను ఉపయోగించి డిజిటల్‌గా ప్రీమియంలు చెల్లించే పాలసీదారు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆన్‌లైన్ పేమెంట్ ప్లాట్‌ఫామ్‌లో ప్రస్తుతం నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, యూపీఐ పేమెంట్ ఆప్షన్స్ మాత్రమే కనిపిస్తున్నాయని సోషల్ మీడియాలో నెటిజన్లు కామంట్ చేస్తున్నారు.
గతంలో ఉన్న క్రెడిట్ కార్డ్ ఆప్షన్‌ను తొలగించడంతో పాలసీదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. అయితే ఏజెంట్ల ద్వారా, LIC శాఖల్లో కూడా ప్రీమియం చెల్లించే అవకాశం కొనసాగుతోంది. క్రెడిట్ కార్డ్ చెల్లింపు ఆప్షన్ తొలగింపుకు పేమెంట్ గేట్‌వే సంస్థ వసూలు చేస్తున్న సర్వీస్ ఛార్జీలే కారణమని కొందరు తెలుస్తోంది. LIC ఆన్‌లైన్ చెల్లింపుల కోసం ఉపయోగించిన బిల్‌డెస్క్ సేవలపై ఛార్జీల విషయంలో LIC, పేమెంట్ గేట్‌వే సంస్థ మధ్య విభేదాలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. క్రెడిట్ కార్డ్ చెల్లింపులకు అదనపు సౌకర్య రుసుము ఉండేదని LIC వెబ్‌సైట్‌లో గతంలో పేర్కొనగా.. డెబిట్ కార్డ్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపులకు ఎలాంటి ఛార్జీలు లేవని సంస్థ స్పష్టం చేసింది.

చెల్లింపుల కోసం మరో పేమెంట్ గేట్‌వే సంస్థతో LIC అధికారులు చర్చలు జరుపుతున్నారని సమాచారం. కొత్త వ్యవస్థ అందుబాటులోకి వస్తే క్రెడిట్ కార్డ్ చెల్లింపు సదుపాయం మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే యూపీఐ యాప్స్ ద్వారా క్రెడిట్ కార్డు పేమెంట్ చేసే అవకాశం ఉందని కొంత మంది చెబుతున్నారు.
కాగా ఎల్ఐసీ ఈ మధ్యే ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా 6.5 శాతం వాటాను విక్రయించింది. దీని ద్వారా సుమారు రూ. 31,552 కోట్లను సమీకరించింది. ఈ వాటా విక్రయంతో ప్రభుత్వ వాటా 96.50% నుంచి 90%కి తగ్గింది. దేశంలో అతి పెద్ద ఇన్సూరెన్స్ సంస్థ ఉన్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇన్సూరెన్స్ మార్కెట్ లో తన వాటాను కోల్పోతోంది. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు తమ వాటాను క్రమంగా పెంచుకుంటున్నాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications