D Mart: రాఖీకి డీ మార్టుల్లో ప్రత్యేక ఆఫర్లు.. భారీగా వెళ్తున్న మహిళలు..!

ఇంట్లో పప్పులు నిండుకున్నాయి.. డీ మార్ట్ వెళ్లాలి. ఇంట్లో వంట నూనె దగ్గర పడింది డీ మార్ట్ కు వెళ్లాలి. ఇలా పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువ మాట్లాడుకుంటారు. ఎందుకంటే డీమార్ట్ వీరినే టార్గెట్ చేసింది. తక్కువ ధరలో నిత్యావసర వస్తువులు, గృహోపకరణాలు అందిస్తున్న డీమార్ట్ తక్కవ కాలంలో బహుళ ప్రాచుర్యం పొందింది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడతో పాటు చాలా పట్టణాల్లో డీ మార్ట్ స్టోర్లు అందుబాటులోకి వచ్చాయి. ఎప్పుడు వెళ్లిన డీమార్ట్ స్టోర్లు రద్దీగా కనిపిస్తాయి. జనాలకు అన్ని వస్తువులు ఒకే చోట దొరకడం, తక్కువ ధర ఉండడం వల్ల డీమార్ట్ వెళ్తున్నారని చెబుతున్నారు.

ఈ నెలలో డీమార్ట్ మరింత రద్దీగా మారే అవకాశం ఉంది. రాఖీ పండుగా సందర్భంగా డీమార్ట్ స్పెషల్ స్వీట్లు, రాఖీలు అందుబాటులోకి తెచ్చినట్లు తెలుస్తోంది. స్టోర్ లో రాఖీలకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. ఈ విభాగంలో ఆకర్షణీయమైన రాఖీలు, రకరకాల డిజైన్ల రాఖీలు అందుబాటులోకి తెచ్చారు. కార్టూన్ థీమ్ రాఖీలు కూడా ఉన్నాయి. రాఖీలతో పాటు స్వీట్లు కూడా ఉన్నాయి. ఇందుకోసం స్పెషల్ ప్యాక్స్ కూడా రెడీ చేశారు. సమాన్ల కోసం డీ మార్ట్ కు వచ్చే వారు పనిలో పనిగా రాఖీలు, స్వీట్లు కూడా కొనుగోలు చేస్తున్నారు.

D Mart

అంతే కాకుండా ఈ నెలలో వరలక్ష్మి వ్రతం ఇందుకు సంబంధించిన పూజా సామాగ్రి కూడా కొనుగోలు చేస్తున్నారు. కాగా మొట్టమొదటి డీ మార్ట్ స్టోర్ ను ఓనర్
రాధా కిషన్ దమానీ ముంబైలో 2002 లో ప్రారంభించారు. కంపెనీ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 10 రాష్ట్రాలలో 415 స్టోర్లను నిర్వహిస్తూ, రూ.57,790 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. రాధా కిషన్ దమానీ మొదటి సూత్రం తక్కువ ఖర్చుతో స్టోర్లు ఏర్పాటు చేయడం. అందుకే ఏ డిమార్ట్ స్టోర్‌లోకి అడుగుపెట్టినా మెరిసే మార్బుల్ ఫ్లోర్లు ఉండవు, ఫ్యాన్సీ డిజైనర్ ఫిక్చర్లు ఉండవు, లైటింగ్ చాలా సాదాసీదాగా ఉంటుంది.

ఫ్యూచర్ గ్రూప్‌కు చెందిన బిగ్ బజార్ వంటి ప్రత్యర్థులు ఖరీదైన మాల్స్‌లో దీర్ఘకాలిక లీజులను ఎంచుకోగా, దమానీ భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. డిమార్ట్ తన స్టోర్లను చాలా వరకు సొంత భవనాల్లోనే ఏర్పాటు చేశారు. ఇందుకు భారీగా పెట్టుబడి అవసరం. కానీ ఈ రోజుల్లో భారీగా పెరిగిన అద్దె ఖర్చులు పెట్టుబడి కంటే ఎక్కువ ఉంటున్నాయి. ఆయన విజయాల్లో మరో సూత్రం క్రెడిట్ సైకిల్. దేశంలోని ఎఫ్ఎంసీజీ రంగంలో సాధారణ క్రెడిట్ సైకిల్ 21 నుంచి 30 రోజులు ఉంది. కానీ డీ మార్ట్ మాత్రం 11 రోజుల్లోనే పేమెంట్ చేస్తోంది. ఇది కూడా ఆ కంపెనీకి కలిసొచ్చింది. అందుకే ఇక్కడ తక్కువ ధరలో వస్తువులు దొరుకుతున్నాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+