LPG ekyc: సిలిండర్ బుక్ చేస్తే బుక్ కావడం లేదా.. అయితే వెంటనే ఈ పని చేయండి..!
మీరు గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ బుక్ చేయడానికి ప్రయత్నిస్తుంటే బుక్ కావడం లేదా. అయితే మీరు ఇకేవైసీ చేసుకోవాల్సిందే. లేకుంటే మీ గ్యాస్ కనెక్షన్ పూర్తిగా రద్దు అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం చాలా మంది గ్యాస్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే కావడం లేదు. దీంతో వారంతా ఏజెన్సీలకు పరుగెడుతున్నారు. ఇకేవైసీ చేసుకుంటేనే గ్యాస్ బుక్ అవుతుందని ఏజెన్సీలు చెబుతున్నాయి. అయితే ఆగస్ట్ 16తోనే ఇకేవైసీ గడువు ముగిసినప్పటికీ.. మరో వారం రోజుల పాటు గడువు పొడగించారు. ఆ లోపు గ్యాస్ కనెక్షన్ కు సంబంధించి ఇకేవైసీ చేసుకోకుంటే.. గ్యాస్ కనెక్షన్ రద్దు అవుతుందని చెబుతున్నారు.
అయితే వినియోగదారులు ఇకేవైసీ చేసుకోవడానికి ఒకేసారి అందరు ప్రయత్నిస్తున్నారు. దీంతో గంటల తరబడి సర్వర్ అంతరాయాలు, సరిగ్గా పనిచేయని యాప్‌లు, అధిక భారం పడిన డిజిటల్ మౌలిక సదుపాయాలు, సులభంగా జరగాల్సిన ఈ ప్రక్రియను చాలా సమయం తీసుకుంటోంది. చాలా మంది గ్యాస్ ఏజెన్సీల ముందు ఇకేవైసీ కోసం క్యూలు కడుతున్నారు. ఎల్‌పిజి డీలర్‌షిప్‌ల వద్ద పొడవైన క్యూలు, కౌంటర్ వద్దకు చేరుకునే సమయానికి సర్వర్ డౌన్ అవడం జరుగుతుంది. మొత్తం ఇ-కెవైసి ప్రక్రియ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల డిజిటల్ మౌలిక సదుపాయాలపైనే ఆధారపడి ఉంటుంది.

వారి సర్వర్లు పనిచేయకపోయినా, లేదా వారి యాప్‌లు నెమ్మదిగా స్పందించినా, కౌంటర్ వద్ద ఎంత మంది సిబ్బంది ఉన్నా లేదా సరైన పత్రాలతో ఎంత మంది వినియోగదారులు వచ్చినా సరే, ఏ పనీ ముందుకు సాగదు. దీంతో గడువు మరింత పెంచాలని వినియోగదారులు కోరుతున్నారు. డీలర్ల విషయానికొస్తే ఒక్క సర్వర్ అంతరాయం వల్ల వారి పని మొత్తం ఆగిపోతుంది. ఇప్పటికైనా సర్వర్లు, యాప్స్ సరిగా పనిచేయకపోతే.. ఆగస్ట్ 23 లోపు గ్యాస్ కనెక్షన్ ఇకేవైసీ పూర్తవడం కష్టమని చెబుతున్నారు. అయితే ఆగస్ట్ 23 వరకు గడువు పోడగించినా.. చాలా మంది ఈకేవైసీ చేసుకోలేని పరిస్థితి ఉంది.
అయితే ఇంట్లో ఉండి స్మార్ట్ ఫోన్ల ద్వారా ఈకేవైసీ చేసుకోవచ్చని చెబుతున్నారు. హిందుస్థాన్ పెట్రోలియం కనెక్షన్ అయితే ప్లేస్టోర్ నుంచి హెచ్‌పీపే యాప్‌తో పాటు ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్ లో రిజిస్టర్ మొబైల్ నంబర్ నమోదు చేసి ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ కావాలి. తరువాత హోమ్‌పేజీలో మై హెచ్‌పీ సెక్షన్‌కు వెళ్లి ఎల్‌పీజీ ఆప్షన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ముఖాన్ని స్కాన్ చేస్తే ఈ-కేవైసీ పూర్తవుతుంది. భారత్ కనెక్షన్ ఉన్నవారు. హలో బీపీసీఎల్ తోపాటు ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుని ఇకైవేసీ చేసుకోవచ్చు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications