Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హత్యకు కుట్ర..!

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతోన్నాయి. ఇరాన్ హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై దాడి చేయడంతో ఈ ఉద్రిక్తత నెలకొంది. ఆ తర్వాత ట్రంప్ ఇరు దేశాల మధ్య ఒప్పందం ముగిసినట్లేనని ప్రకటన చేశారు. కాగా తాజా ఓ నివేదిక బయటకు వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేయడానికి ఇరాన్ ఇటీవల ఒక ప్రణాళికను రూపొందించిందని హెచ్చరిస్తూ ఇజ్రాయెల్ అమెరికాతో పంచుకున్నట్లు ఓ నివేదిక బయటకు వచ్చింది. ఇరాన్‌పై దాడులను తీవ్రతరం చేయాలా వద్దా అని ట్రంప్ ఆలోచిస్తున్న తరుణంలో ఆయన నిర్ణయాలను ప్రభావితం చేయడానికి ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోందని అమెరికా అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇరాన్ విషయంలో ట్రంప్ నిర్ణయాలను ప్రభావితం చేయడానికి టెల్ అవీవ్ చేస్తున్న విస్తృత ప్రయత్నంలో భాగంగానే ఇజ్రాయెల్ తాజా నిఘా సమాచారం అమెరికా సీరియస్ తీసుకోవడం లేదని ఆ నివేదిక పేర్కొంది. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చర్య కారణంగానే ఆయనతో ఉన్న స్నేహ సంబంధాలు దెబ్బతిన్నాయి. లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనిక చర్యకు గాను ట్రంప్, నెతన్యాహుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Donald Trump

ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరు నాయకుల మధ్య సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. కాగా జూన్ లో అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. దీంతో అమెరికా ఇరాన్ చమురుపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసింది. అటు ఇరాన్ హార్మూజ్ జలసంధి గుండా స్వేచ్ఛా నౌక రవాణాకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ కు చెందిన ఐఆర్జీసీ జల సంధిలో నౌకలపై దాడి చేయడంతో అమెరికా తీవ్రంగా స్పందించింది. ఇరాన్ పై వరుస దాడులతో విరుచుకుపడింది. అటు ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లోనే అమెరికా రక్షణ స్థావరాలపై దాడి చేసింది.

ఈ నేపథ్యంలోనే ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇరాన్ అంతు చూస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే డొనాల్డ్ ట్రంప్ ను హత్య చేయడానికి ఇరాన్ ప్రణాళిక రచిస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. అయితే గత కొన్ని వారాలుగా, ట్రంప్‌ను హత్య చేయడానికి ఇరాన్ ప్రణాళికలు రచిస్తున్నట్లు సూచిస్తూ అమెరికా నిఘా సంస్థలకు నిరంతరం నివేదికలు అందుతూనే ఉన్నాయి. వీటిపై ట్రంప్ స్పందించారు. వారు అమెరికా నాయకుడిని అంటే తనను అంతం చేయాలని అనుకుంటున్నారని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+