America: అమెరికాలో దారుణంగా భారతీయుల పరిస్థితి.. రాత్రికి రాత్రే ఇండియాకు వస్తున్నారు..!
అమెరికాలో విదేశీయుల పరిస్థితి రోజు రోజుకు ఇబ్బందికరంగా మారుతుంది. అక్కడి వారు విదేశీయులపై కోపం పెంచుకుంటున్నారు. తమ దేశం ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తున్నారు. తమ ఉపాధిని దెబ్బ తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ప్రభుత్వం కూడా వలస వాదులపై ఉక్కుపాదం మోపుతోంది. అన్ని నిబంధనలు కఠినతరం చేస్తోంది. దీంతో విదేశీయులు అక్కడ ఉండేందుకు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఇండియన్స్ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అగ్రరాజ్యంలో స్థిరపడాలని, తమ పిల్లలకు మెరుగైన భవిష్యత్తు అందించాలని కలలు కన్న ఎంతో మంది భారతీయులు, ముఖ్యంగా తెలుగు సాఫ్ట్‌వేర్ నిపుణులు ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.
అక్కడ లే ఆఫ్స్ జరగడం.. ఆ లే ఆఫ్స్ భారతీయులు ఉద్యోగాలు కోల్పోతున్నారు. మళ్లీ ఉద్యోగం రావడం కష్టంగా ఉంది. అమెరికాలో ఉంటూ భారీ వేతనాలు అందుకున్నవారే ఇప్పుడు సర్వస్వం కోల్పోతున్నారు. దిక్కుతోచని స్థితిలో రాత్రికి రాత్రే భారత్‌కు తిరిగి వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఉద్యోగాలు కోల్పోవడం, H-1B వీసా రూల్స్ కఠినంగా మారడం, మరోవైపు I-140 పిటిషన్లు తిరస్కరించబడటంతో చాలా మందికి అమెరికాలో ఉండటానికి చట్టపరమైన అవకాశాలు కోల్పోతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ డల్లాస్‌లో ఇంకా 8 నెలల హోమ్ లీజు గడువు ఉన్నప్పటికీ, ఐ-140 తిరస్కరించడంతో మరుక్షణమే భారత్‌కు తిరిగి వచ్చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు.

అక్కడ ఉంటే నెలకు 1,800 డాలర్ల అద్దె కట్టాల్సి రావడం, కనీసం అమ్మేందుకు వీలుపడక పోవడంతో కార్లను స్క్రాప్‌యార్డ్‌కు తరలిస్తున్నారు. విలువైన వస్తువులను చెత్తలో పడేసి ప్రాణభయంతో ఇండియా ఫ్లైట్ ఎక్కేశానని ఓ మహిళ చెప్పారు. ఒకప్పుడు అమెరికాలో ఏడాదికి కోటి వేతనంగా అందుకున్న తెలుగు ఇంజినీర్ ప్రస్తుతం హైదరాబాద్ లో రూ.35 లక్షల ప్యాకేజీతో సరిపెట్టుకున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం అమెరికాలో నెలకొన్న పరిస్థితులు 2008 ఆర్థిక మాంద్యాన్ని తలపిస్తున్నాయని ప్రవాస సంఘాల నేతలు చెబుతున్నారు. కోవిడ్ అనంతర బూమ్ సమయంలో ఎగబడి అమెరికాలో ఇళ్లు కొన్న టెక్కీలు, ఇప్పుడు పెరిగిన వడ్డీ రేట్ల దెబ్బకు విలవిల్లాడుతున్నారు.
హోమ్ లోన్ వడ్డీ రేట్లు 4 శాతం నుంచి ఏకంగా 7.5 శాతానికి పైకి చేరటంతో పాటు, విపరీతమైన ద్రవ్యోల్బణం, పెరిగిన హోమ్ లోన్ భారంతో ఇళ్ల అమ్మకాలు పడిపోయాయని అక్కడి వారు చెబుతున్నారు. భారత్ నుంచి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి గత మూడు, నాలుగేళ్లుగా పై చదువుల కోసం అమెరికా వెళ్లినవారు చదువు పూర్తి అయినా ఉద్యోగాలు దొరకడం లేదు. చాలా మంది పెట్రోల్ బంకులు, సూపర్ మార్కెట్, డెలివరీ బాయ్ గా పని చేస్తున్నారు. అందుకే ఇప్పుడు అమెరికా వెళ్లే భారతీయుల సంఖ్య భారీగా తగ్గింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications