Infosys: నేపాల్ వరదల్లో గల్లంతైన ఇన్ఫోసిస్ అనుబంధ సంస్థ పబ్లిక్ సర్వీస్ సీఈఓ గోపీశెట్టి..!
నేపాల్ లో వచ్చిన వరదలు తీవ్ర నష్టాన్ని మిగుల్చాయి. ఆకస్మిక వరదల కారణంగా చాలా ప్రాణ నష్టం జరిగింది. ఈ వరదల్లో చాలా మంది గల్లంతు అయ్యాయి. కాగా ఇప్పటికే ఈ వరదల వల్ల మృతి చెందినవారి సంఖ్య 600 చేరింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. చాలా మంది భారతీయులు కూడా నేపాల్ వరదల్లో గల్లంతు అయ్యారు. వరదల్లో గల్లంతు అయిన వారి గురించి తాజాగా కీలక సమాచారం బయటకు వచ్చింది. భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అనుబంధ సంస్థ పబ్లిక్ సర్వీస్ సీఈఓ గోపీశెట్టి నేపాల్ వరదల్లో గల్లంతు అయినట్లు తెలిసింది. వ్యక్తిగత పని మీద గోపిశెట్టి నేపాల్‌కు వెళ్లారని ఇన్ఫోసిస్ తెలిపింది.
అయితే, నేపాల్‌లో వరదలు సంభవించిన రోజు నుంచి ఆయన సంప్రదించలేకపోతున్నామని ఇన్ఫోసిస్ వివరించింది. ఆయన్ను కాంటాక్ట్ అయ్యేందుకు సంబంధిత ఏజెన్సీలతో కలిసి పని చేస్తున్నామని పేర్కొంది. ఈ క్లిష్ట సమయంలో గోపీశెట్టి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని కంపెనీ ప్రకటించింది. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్ కంపెనీ సీఈవో అయిన గోపీశెట్టి వ్యూహాలు, సాంకేతికత, కార్యకలాపాలు వంటి అంశాల్లో ప్రభుత్వ సంస్థలకు సలహాలు, సూచనలు చేస్తుంటారు. గతంలో ఆయన ఇన్ఫోసిస్ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. అలాగే, బిజినెస్ అప్లికేషన్స్, డిజిటల్ వర్క్ స్పేస్ సర్వీస్ విభాగానికి హెడ్ గా కూడా బాధ్యతలు నిర్వహించారు.

ఆగస్ట్ 26న నేపాల్-చైనా సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల ఇప్పటి వరకు 600 మందికి పైగా చనిపోయారని నేపాల్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వేల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారని తెలిపింది. సహయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది.సహయక చర్యల్లో తొలుత విదేశాల సహయం అవసరం లేదన్న నేపాల్ ప్రభుత్వం తర్వాత మనసు మార్చుకుంది. రెస్క్యూ ఆపరేషన్, పునరావాస చర్యల్లో సహయం చేయాలని ప్రపంచదేశాలకు విజ్ఞప్తి చేసింది. నేపాల్ విజ్ఞప్తి మేరకు ఇండియా, చైనా సహా పలు దేశాలు నేపాల్ లో రెస్క్యూ ఆపరేషన్ చర్యల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే భారత్ అత్యవసర వస్తువులను నేపాల్ కు పంపింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications