Gold: మార్కెట్ ధర కంటే రూ.8 వేల తక్కువకే బంగారం.. ఎక్కడంటే..!

బంగారం ధరలు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం బంగారం ధర తగ్గినప్పటికీ ఇంకా ఎక్కువగానే ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే బంగారం ధర పెరుగుతున్నప్పటికీ ప్రజలు పసిడి కొనుగోలు ఆపడం లేదు. దీంతో భారత్ భారీగా బంగారం దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఫలితంగా విదేశీ మారక నిల్వలు పడిపోయాయి. దీంతో కేంద్రం పసిడి దిగుమతిపై సుంకాన్ని 15 శాతానికి పెంచింది. దీంతో దేశంలోకి అక్రమంగా బంగారం రావడం పెరిగింది. ఏదో ఒక రూపంలో గోల్డ్ స్మగ్లింగ్ కొనసాగుతోంది. దీంతో వ్యాపారులు నష్టపోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొంత మంది వినియోగాదారులు ఈ స్మగ్లింగ్ పుత్తడిని కొనుగోలు చేస్తున్నారు.

అక్రమ దిగుమతి చేసుకున్న బంగారం ధర తక్కువ ఉండడం ఇందుకు ప్రధాన కారణం. స్మగ్లింగ్ చేసిన పసిడి ధర మార్కెట్ ధర కంటే దాదాపు రూ.8 వేలకు తక్కువగా అమ్ముతున్నారని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఫలితంగా తక్కువ ధర ఉన్న వద్దే వినియోగదారులు పసిడిని కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం సంవత్సరంలో చట్టవిరుద్ధ మార్గాల ద్వారా వచ్చే బంగారం పరిమాణం 100 టన్నుల వరకు ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా. ఆగస్ట్ లో 27 కేజీల స్మగుల్డ్​ బంగారాన్ని ఏజెన్సీ స్వాధీనం చేసుకుని, 12 మందిని అరెస్టు చేసింది. అక్రమ బంగారు దిగుమతి నిజమైన వ్యాపారులకు ఏ విధంగానూ మేలు చేయబోదని నిపుణులు చెబుతున్నారు.

Gold

బంగారంపై విధిస్తున్న భారీ సుంకాలు గ్రే మార్కెట్ చురుగ్గా ఉందనడానికి కారణమని వివరిస్తున్నారు. అధిక దిగుమతి సుంకాలు భారతీయ, అంతర్జాతీయ బంగారం ధరల మధ్య వ్యత్యాసాన్ని పెంచుతాయని గుర్తు చేస్తున్నారు. 2013 ప్రారంభంలో బంగారంపై నాలుగు శాతం సుంకం పెరిగిన తర్వాత, అనధికారిక పసిడి దిగుమతులు 2013 మొదటి త్రైమాసికంలోని 10 టన్నుల నుంచి 2014 మొదటి త్రైమాసికంలో దాదాపు 70 టన్నులకు పెరిగాయని పేర్కొంటున్నారు. 2013-2019 మధ్య సుంకాలు 10 శాతానికి చేరిన తర్వాత కూడా అక్రమ రవాణా ఆగలేదని వివరిస్తున్నారు. ఇది సగటున త్రైమాసికానికి 34 టన్నుల వరకు ఉంటుందని అంచనా వేశారు.

బంగారంపై సుంకం పెంచడానికి బదులుగా ఎగుమతులు పెంచడానికి ప్రయత్నాలు చేయాలని బంగారం వ్యాపారులు చెబుతున్నారు. పసిడిపై సుంకాన్ని 5 శాతానికి తగ్గించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా అక్రమంగా కొనుగోలు చేసిన బంగారానికి బిల్ ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా కొనుగోలు చేయడం వల్ల నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో నకిలీ బంగారం లేదా క్వాలిటీ తక్కువ ఉన్న బంగారం అంటగట్టే అవకాశం ఉందని చెబుతున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+