Crude Oil: సౌదీ అరేబియా అతి పెద్ద రిఫైనరీపై హౌతీల దాడులు.. భారీగా పెరిగిన ముడి చమురు ధర..
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతోంది. తాజాగా ఇరాన్ మద్దతు గల హౌతీలు సౌదీ అరేబియాలోని ఆయిల్ రిఫైనరీపై దాడి చేసింది. తెల్లవారుజామున జిజాన్‌లోని సౌదీ అరామ్కో రిఫైనరీ కాంప్లెక్స్‌పై డ్రోన్ తో దాడి చేసినట్లు హౌతీలు ప్రకటించుకున్నారు. అదే సమయంలో ఉత్తరాన ఉన్న యాన్బు ఎగుమతి టెర్మినల్‌పై కూడా దాడి చేసింది. సౌదీ అరేబియా పనిచేస్తున్న ముడి చమురు ఎగుమతి కారిడార్‌కు అనుసంధానంగా ఉన్న ఏకైక ఓడరేవు ఇదే. యెమెన్‌పై సౌదీ జరిపిన వైమానిక దాడులకు వ్యతిరేకంగా ప్రతిదాడులు చేసినట్లు హౌతీలు ప్రకటించుకున్నారు. యెమెన్‌పై దిగ్బంధనం ఎత్తివేసే వరకు ఎర్ర సముద్రంలో నౌకలను అడ్డుకుంటామని హెచ్చరించారు.
హౌతీలు ఇప్పటికే ఎర్ర సముద్రం దిగ్బంధనాన్ని ప్రకటించిన సంగతి తెలసిందే. ఈ నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధర భారీగా పెరిగింది. ట్రేడింగ్‌లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు మళ్లీ 100 డాలర్లు దాటింది. హార్మూజ్ జల సంధి వద్ద ఇబ్బందులు ఎదుర్కుంటున్న సమయంలో సౌదీ ఆరేబియా సౌదీ అరేబియా తన ముడి చమురు ఎగుమతులను 1,200 మైళ్ల తూర్పు-పశ్చిమ పైప్‌లైన్ ద్వారా యాన్బుకు పశ్చిమ దిశగా మళ్లించడానికి ఐదు నెలలుగా కృషి చేస్తోంది. దాదాపు ఈ పని పూర్తి కావోస్తోంది. అయితే ఈ ముడి చమురు బాబ్ అల్-మండేబ్ జలసంధి గుండానే బయటకు వెళ్లాలి. దీనిని హౌతీలు జూలై 20న దిగ్బంధన ప్రాంతంగా ప్రకటించారు.

అందుకే ముడి చమురు ధర భారీగా పెరిగింది. హౌతీ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ యాహ్యా సరీ రెండు చోట్ల దాడులు చేసినట్లు ప్రకటించారు. మొదటి దాడి జిజాన్‌లోని సున్నితమైన అరామ్కో-అనుబంధ సౌకర్యాలను డజన్ల కొద్దీ బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్‌లతో దాడి చేసినట్లు వివరించారు. రెండో దాడి యాన్బులోని సున్నితమైన అరామ్కో-అనుబంధ సౌకర్యాలను అనేక బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్‌లతో దాడి చేసినట్లు విరించారు. రిఫైనరీ కాంప్లెక్స్ తూర్పు భాగంలో భారీగ మంటలు చెలరేగినట్లు నాసా ఫమ్స్ ఉపగ్రహ వ్యవస్థ ద్వారా తెలుస్తోంది.
సోషల్ మీడియా వీడియోలో పారిశ్రామిక ప్రాంతంలో పెద్ద మంటలు చెలరేగడం కనిపించింది. ప్రాంతీయ మీడియా కనీసం ఐదు పేలుళ్లు జరిగినట్లు నివేదించింది.
యాన్బులో, సౌదీ వైమానిక రక్షణ విభాగం మెరుగ్గా పనిచేసింది. దూసుకొస్తున్న రెండు బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకున్నట్లు తెలిసింది. ఈ రక్షణ వ్యవస్థను గ్రీక్ సైనిక సిబ్బంది నిర్వహించారు. సౌదీ పౌర రక్షణ విభాగం జిజాన్, యాన్బు రెండింటి నివాసితులకు అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు కిటికీలకు దూరంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది.
దాడులు ఈ విధంగా ఇంకా కొనసాగితే.. ముడి చమురు ధర భారీగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదే జరిగితే భారత్ పై తీవ్ర ప్రభావం చూపనుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications