Gold: బ్యాంకు లాకర్‎లో దాచిన 30 తులాల బంగారం మాయం..

బంగారం ఇంట్లో దొంగల భయం ఉంటుందని చాలా మంది బ్యాంకులో పెడతారు. కొంత మంది బంగారంపై లోను తీసుకుంటారు. మరికొందరు బ్యాంకులో లాకర్ తీసుకుని బంగారం అందులో పెడతారు. ఇలానే ఓ మహిళ బ్యాంకులో లాకర్ తీసుకుని బంగారాన్ని దాచింది. ఆ తర్వాత ఆ మహిళకు ఊహించని షాక్ తగిలిగింది. లాకర్ ఓపెన్ చేసి చూడా అందులో బంగారం లేదు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. కాన్పూర్ లో ఎస్బీఐ లో ఓ మహిళ 17 ఏళ్ల క్రితం లాకర్ తీసుకున్నారు. అందులో బంగారం పెట్టారు. తాజాగా లాకర్ తెరవగా.. అందులో బంగారం మాయమైనట్లు గుర్తించింది.

సదరు మహిళ 2003లో తన పెళ్లి నగలతో పాటు ఫ్యామిలీ గోల్డ్ ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను లాకర్‌లో భద్రపరిచారు. వాటి విలువ సుమారు రూ.50 లక్షలు ఉంటుందని చెబుతున్నారు. భర్త మరణం తర్వాత కుమార్తె వద్దకు వెళ్లి ఉంటున్న ఆమె.. జూలై 2026లో తన లాకర్‌ను పరిశీలించేందుకు బ్యాంకుకు వెళ్లడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. బ్యాంకు శాఖకు వెళ్లిన సమయంలో మొదట మహిళకు మరో షాక్ ఎదురైనట్లు వార్తలు వస్తున్నాయి. తనకు లాకర్ ఉందని ఆమె చెప్పినప్పటికీ.. లాకర్ మేనేజర్ మాత్రం ఆ బ్రాంచ్‌లో ఆమె పేరుతో ఎలాంటి లాకర్ లేదని చెప్పినట్లు సమాచారం.

Bank Locker

అయితే కొన్ని రోజుల తర్వాత లాకర్ నంబర్ 23ను గుర్తించారని తెలిసింది. దాన్ని తెరిచి చూడగా పూర్తిగా ఖాళీగా ఉండటంతో మహిళ షాక్ అయింది. బంగారం కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. అయితే బ్యాంకు రికార్డుల ప్రకారం 2020లో లాకర్ నంబర్ 23ను రెండు సార్లు తెరిచినట్లు ఉందని వార్తలు వస్తున్నాయి. అప్పుడు ఆ లాకర్ ను తెరిచింది ఎవరు. బంగారాన్ని తీసింది ఎవరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ చోరీలో బ్యాంక్ అధికారుల ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మహిళ లాకర్ దాదాపు 30 తులాల బంగారం దాచినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై కాన్పూర్‌లోని స్వరూప్ నగర్ పోలీసులు ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్‌తో పాటు మరికొందరు బ్యాంకు సిబ్బందిపై కేసు నమోదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. లాకర్ యాక్సెస్ రికార్డులు, బ్యాంకు డాక్యుమెంట్లు, సిబ్బంది పాత్ర తదితర అంశాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి ఈ లాకర్ ఇష్యూపై స్టేట్ బ్యాంక్ అధికారికంగా స్పందించలేదు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+