Hindustan Uniliver News: భారతీయుల విషయంలో మల్టీనేషనల్ కంపెనీలు వ్యవహరిస్తున్న తీరు గురించి మరోసారి సంచలన విషయాలు బయటకు వచ్చాయి. స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని దశాబ్ధాలు గడుస్తున్నా భారతీయులను వారు చూస్తున్న చిన్నచూపు చాలా మందిలో ఆగ్రహానికి దారితీస్తోంది.
వివరాల్లోకి వెళితే అమెరికాకు చెందిన వ్యాపార దిగ్గజాలు పెప్సికో, హిందుస్థాన్ యూనీలివర్ అనేక వ్యాపారాల్లో వివిధ ఉత్పత్తులను భారతదేశంలో విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. చాలా మంది ఈ కంపెనీలు ఉత్పత్తులను నిరంతరం వినియోగిస్తూనే ఉంటాం. కొత్తగా వెలుగులోకి వచ్చిన నివేదిక ప్రకారం ఇవి సంపన్న దేశాల్లో ఉత్పత్తుల క్వాలిటీతో పోల్చితే భారతదేశంలో నాసిరకం పోషక విలువలు కలిగిన ఉత్పత్తులను విక్రయిస్తున్నాయని తేలింది. లాభాపేక్షలేని గ్లోబల్ సంస్థ యాక్సెస్ టు న్యూట్రిషన్ ఇనిషియేటివ్ (ATNI) ఈ విషయాలు వెలుగులోకి తెచ్చింది. ఇవి అంతర్జాతీయ బ్రాండ్‌లతో పాటు, తక్కువ-ఆదాయ మార్కెట్‌లలో గణనీయంగా తక్కువ ఆరోగ్య రేటింగ్‌లతో ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తున్నాయని కనుగొంది. దీనికి ముందు నెస్లే బేబీ పుడ్స్ విషయంలో షుగర్ క్వాలిటీ గురించి కూడా షాకింగ్ విషయాలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

పరిశోధనలో పోషకాహార ప్రమాణాలలో పూర్తి అసమానతను వెల్లడి చేసిందని రాయిటర్స్ నివేదించింది. పేద దేశాల్లో విక్రయించే ఉత్పత్తులు హెల్త్ స్టార్ రేటింగ్ సిస్టమ్‌లో సగటున 5కి 1.8 స్కోర్‌ను సాధించాయని వెల్లడైంది. ఇదే క్రమంలో అదే బ్రాండ్ ఉత్పత్తులకు హెల్త్ స్టార్ రేటింగ్ సగటున 2.3గా ఉన్నట్లు రీసెర్చ్ వెల్లడించింది. ఇండియా, పాకిస్తాన్, నైజీరియా, ఫిలిప్పీన్స్ వంటి ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పాటు, తక్కువ పోషక విలువ కలిగిన ఉత్పత్తులను పొందుతున్నట్లు కనిపిస్తోంది. పెప్సికో, యూనిలీవర్, డానోన్, నెస్లేతో సహా 30 ప్రధాన ఆహార కంపెనీలను అంచనా వేసిన ATNI సూచిక, సంపన్న, తక్కువ-ఆదాయ దేశాలలో విక్రయించే ఉత్పత్తుల మధ్య తేడాను గుర్తించడం ఇదే మొదటిది కావటం గమనార్హం.
రీసెర్చ్ ఫైండింగ్స్ ప్రకారం కంపెనీల ఒకే రకమైన ఉత్పత్తులకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి అభివృద్ధి చేయబడిన హెల్త్ స్టార్ రేటింగ్ సిస్టమ్ 3.5 కంటే ఎక్కువ స్కోర్‌ను "ఆరోగ్యకరమైనది"గా పరిగణిస్తుంది. కార్పొరేట్ కంపెనీల ద్వంద్వ ప్రమాణాల గురించి ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరిగిపోతున్నాయి. భారత్ వంటి అధిక జనసాంద్రత కలిగిన దేశాల్లో కంపెనీల ఉత్పత్తులు అధికంగా వినియోగించబడుతున్న వేళ ఈ రిపోర్ట్ చాలా మంది సామాన్య మధ్యతరగతి భారతీయులను ఆందోళనకు గురిచేస్తోంది. దీని ప్రకారం మల్టీనేషనల్ ఆహార కంపెనీలు అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లలో పోషక సమానత్వం కంటే లాభాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడవుతోంది. ఈ రిపోర్టు బయటకు రావటంతో చాలా మంది భారత ప్రభుత్వం ఇలాంటి వాటిపై దృష్టి సారించాలని కోరుతున్నారు. మల్టీనేషనల్ కంపెనీల వైఖరి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని వారు అంటున్నారు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications