RBI News: వడ్డీ రేట్లలో లేని మార్పు.. బ్యాంక్ డిపాజిటర్లపై ప్రభావం ఇదే..
RBI News: జూన్ 8న ముగిసిన మానిటరీ పాలసీ సమావేశంలో రిజర్వు బ్యాంక్ ప్రజలకు అతిపెద్ద ఊరటను ప్రకటించింది. అందరూ ఊహించినట్లుగానే ఈసారి కూడా రెపో రేటును 6.50 శాతం వద్దే కొనసాగిస్తున్నట్లు గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు.
దాస్ తాజా ప్రకటన పర్సనల్ లోన్, హోమ్ లోన్, కార్ లోన్ వంటి రుణాలు పొందిన వారికి పెద్ద ఊరటను అందిస్తోంది. వరుసగా రెండో సారి రేట్ల పెంపుకు బ్రేక్ వేయటం వల్ల వారిపై కొత్త భారం పడలేదు. ఇప్పటికే ఏడాదికి పైగా అధిక వడ్డీ రేట్లు వారిని ఇబ్బందులకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే. ఇకపై రేట్ల పెంపు ఉండకపోవచ్చని తెలుస్తోంది కాబట్టి గృహ రుణాలు పొందాలనుకునే వారు ఇప్పుడు కలలను నెరవేర్చుకునేందుకు ముందుకు వెళ్లొచ్చు.

మే 2022 నుంచి రిజర్వు బ్యాంక్ రెపో రేటును 250 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. తాజాగా రేట్లలో మార్పులుండవని చెప్పటం ఫిక్స్‌డ్ డిపాజిటర్లకు కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఇకపై డిపాజిట్ రేట్ల పెరిగే అవకాశం కనిపించటం లేదు కాబట్టి.. ఇప్పుడు డబ్బులు డిపాజిట్ చేయాలనుకునే వారికి మంచి సమయంగా చెప్పుకోవచ్చు. రానున్న కాలంలో రేట్లు తగ్గే అవకాశం ఉన్నందున హోమ్ లోన్ తీసుకోవాలనుకునే వారు సైతం ముందుకు వెళ్లొచ్చని ఫైనాన్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రస్తుతం 7-8 శాతం వడ్డీని, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు 9 శాతానికి పైగా వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. ఇదే సమయంలో సీనియర్ సిటిజన్లకు సాధారణ కస్టమర్ల కంటే 0.50 శాతం అదనంగా రేట్లను అందిస్తున్నాయి. దేశంలోని వివిధ బ్యాంకులు అందిస్తున్న వడ్డీ రేట్లను గమనిస్తే..
RBL బ్యాంక్- 3.50% నుంచి 7.80%
IDFC ఫస్ట్ బ్యాంక్- 3.50% నుంచి 7.75%
కరూర్ వైశ్యా బ్యాంక్ - 4% నుంచి 7.50%
కెనరా బ్యాంక్- 4% నుంచి 7.25%
పంజాబ్ నేషనల్ బ్యాంక్-3.50% నుంచి 7.25%
HDFC బ్యాంక్- 3% నుంచి 7.25%
SBI- 3% నుంచి 7.10%
బాంధన్ బ్యాంక్ - 3% నుంచి 8%
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ - 4% నుంచి 9.10%
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్- 3.75% నుంచి 8.25%
ISAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్- 4% నుంచి 8.50%
యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్- 4.50% నుంచి 9%
ఉత్క్రిష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్- 4% నుంచి 8.25%
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్- 3.50% నుంచి 8.50%


Click it and Unblock the Notifications