రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI ) ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం ఈరోజు (ఫిబ్రవరి 6) రెండవ రోజుకు చేరుకుంది. అయితే కీలక వడ్డీ రేట్లపై కమిటీ సభ్యులు చర్చించారు, దేశీయ ద్రవ్య పరిస్థితులను పరిష్కరించడానికి అలాగే రూపాయి అస్థిరతను తగ్గించడానికి తీసుకునే చర్యలతో పాటు MPC ఈ నెలలో 25 బేసిస్ పాయింట్ల కోతను ప్రకటించే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు తెలిపారు.
ముఖ్యంగా కొత్తగా నియమితులైన RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా నాయకత్వంలో ఇది మొదటి పాలసీ సమావేశం. డిసెంబర్ ప్రారంభంలో మాజీ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్థానంలో రాబోయే 3 సంవత్సరాలకు రిజర్వ్ బ్యాంకు 26వ గవర్నర్‌గా అయన బాధ్యతలు స్వీకరించారు.

బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక ప్రకారం, ఫిబ్రవరి 7న జరగనున్న ద్రవ్య విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు (bps) తగ్గించవచ్చు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం వల్ల ఆర్‌బిఐ ఈ నిర్ణయాన్ని పరిగణించవచ్చని నివేదిక సూచించింది.
ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గింపు
గత కొన్ని నెలలుగా ద్రవ్యోల్బణం స్థాయి తగ్గుముఖం పట్టాయని నివేదిక పేర్కొంది. టమోటాలు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు వంటి ముఖ్యమైన కూరగాయల ధరలు తగ్గడం వల్ల కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI) స్థిరపడింది.దింతో మెరుగైన సప్లయ్ కారణంగా ధరల అస్థిరత తగ్గింపుకు దారితీసింది, ఇది RBI వడ్డీ రేట్లను తగ్గించడానికి అవకాశాన్ని అందిస్తుంది. అయితే, ఈ ప్రక్రియ దశలవారీగా జరుగుతుంది అలాగే ఆర్థిక డేటాపై ఆధారపడి ఉంటుంది.
ప్రపంచ & దేశీయ అంశాల ప్రభావం
ద్రవ్య విధానంపై నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆర్‌బిఐ అనేక ప్రపంచ, దేశీయ సవాళ్లను దృష్టిలో ఉంచుకోవాలి. నివేదిక ప్రకారం, ఇటీవలి కాలంలో ఆర్థిక మార్కెట్లలో అస్థిరత పెరిగింది, ఇది భారత రూపాయిని ప్రభావితం చేసింది. అమెరికా, కెనడా, మెక్సికో సహా చైనా వంటి దేశాలు విధించే సుంకాల పెంపుదల, వాణిజ్య విధానాల కారణంగా ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతోంది. అమెరికా డాలర్ బలపడటం భారత కరెన్సీపై ఒత్తిడి పెంచింది.
దేశీయ బ్యాంకింగ్ అండ్ ఆర్థిక పరిస్థితులు
దేశీయ ద్రవ్యత పరిస్థితులు కూడా సవాలుగా ఉన్నాయి. బ్యాంకులు డిపాజిట్ వృద్ధి మందగమనం ఎదుర్కొంటున్నాయి, ఇది క్రెడిట్ ప్రవాహాన్ని ప్రభావితం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో కార్పొరేట్ ఫలితాలు మార్కెట్లో డిమాండ్ స్థిరంగా లేవని చూపిస్తున్నాయి, ఇది కంపెనీల అమ్మకాలను ప్రభావితం చేసింది. దీనితో పాటు తయారీ రంగం గ్రాస్ వాల్యూ యాడెడ్ (GVA)లో కూడా మందగమనం కనిపిస్తుంది.
ఆర్‌బిఐ వ్యూహం
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ఆర్‌బిఐ బ్యాలెన్స్ విధానాన్ని అవలంబించి రేపో రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించవచ్చని నివేదిక సూచిస్తుంది. ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగిస్తూ ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం దీని లక్ష్యం. అలాగే, భవిష్యత్తులో రిజర్వ్ బ్యాంకు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా తగిన పాలసీ నిర్ణయాలు తీసుకునేలా జాగ్రత్తగా ఇంకా డేటా ఆధారిత విధానాన్ని అవలంబిస్తుంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications