Hyderabad News: హైదరాబాదీలకు బెంగళూరు టెక్కీలతో కష్టాలు.. ఊహించలే..
Bengaluru News: దేశంలో ఐటీ జాబ్ అనగానే ముందుగా టెక్కీలు ఎంచుకునే ప్రదేశాలు బెంగళూరు లేదా హైదరాబాద్. కంపెనీలు సైతం ఈ రెండు నగరాల్లో పెద్ద ఆఫీసులను కలిగి ఉన్న సంగతి తెలిసిందే. నివాసయోగ్యంగా ఉండే ఈ రెండు నగరాల్లోని వసతులు వారిని ఎక్కువగా ఆకట్టుకోవటమే వారి ఎంపికకు కారణంగా ఉంది.
అయితే ప్రస్తుతం కర్ణాటక రాజధాని బెంగళూరు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తాగటానికి తప్ప మిగిలిన అవసరాలకు సరిపడా నీళ్లు లేకపోవటం అక్కడి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. అందుకే చాలా మంది టెక్కీలు బెంగళూరు ఆఫీసుల నుంచి హైదరాబాద్ ఆఫీసులకు తమ వర్క్ మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో హైదరాబాద్ లోని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

అవును బెంగళూరు నుంచి టెక్కీలు హైదరాబాదుకు మారుతున్న వేళ ఇక్కడ వారికి అవసరమైన స్థాయిలో అద్దెకు ఇళ్లు లేకపోవటం కొత్త ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. అద్దె ఇళ్లకు డిమాండ్ మామూలు కంటే ఎక్కువ కావటంతో ఇంటి ఓనర్లు నోటికొచ్చినంత అద్దె చెబుతున్నారు. హైటెక్ సిటీ చుట్టుపక్క ప్రాంతాల్లో సింగిల్ బెడ్ రూమ్ ఇళ్లు గరిష్ఠంగా రూ.30,000 పైగానే పలుకుతున్నాయి. దీంతో చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకునే ఇతర రంగాల్లోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఐటీ ఉద్యోగులకు ఇస్తే ఎక్కువ అద్దే వస్తుందనే ఆలోచనలో ఇంటి ఓనర్లు ఉండటం పరిస్థితులను తీవ్రతరం చేస్తోంది. ఈ పరిస్థితులపై చాలా మంది మధ్య తరగతి ఆదాయ వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఇప్పటికే బెంగళూరులోని టెక్ కంపెనీలకు కేరళ ప్రభుత్వంలోని మంత్రులు ఆఫర్లు ఇవ్వటం, అన్ని వసతులు కల్పిస్తామని చెప్పటం కొంత వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. టెక్ కంపెనీలు వనరులు, వసతులు ఉన్న కేరళ రాష్ట్రానికి తమ ఉద్యోగులను మార్చితే మంచిదనే ఆలోచనలో సగటు హైదరాబాదీలు ఉన్నారు. బెంగళూరులోని పరిస్థితులు తమకు కొత్త కష్టాలు తెచ్చిపెడుతున్నాయని వారు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications