Hyderabad: ఒకప్పుడు అన్ని వర్గాల వారికి దారు బతికేందుకు దారి చూపించి, నీడనిచ్చిన హైదరాబాద్ మహానగరం ప్రస్తుతం మధ్యతరగతికి దూరమైపోతోంది. రోజురోజుకూ పెరిగిపోతున్న అద్దెలు బడుగు జీవులకు శాపంగా మారుతోంది.
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో అద్దె ఇళ్లకు రికార్డు స్థాయిలో కొరత ఏర్పడింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరానికి దేశం నలుమూలల నుంచి ప్రజలు తరలి రావటంతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో ఉన్న ఇళ్లకు అద్దెలు ఆకాశాన్ని తాకుతున్నాయి. జూన్ క్వార్టర్ మ్యాజిక్ బ్రిక్స్ గణాంకాల ప్రకారం అద్దె ఇళ్లకు డిమాండ్ 22 శాతం పెరిగింది. కానీ సరఫరా మాత్రం చాలా తక్కువ స్థాయిలో ఉంది.

ఎక్కువ మంది ఐటీ రంగంలో పనిచేసేందుకు నగరానికి తరలివస్తున్న వేళ ప్రధానంగా గచ్చిబౌలి, కొండాపూర్, హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఇళ్ల కోసం అన్వేషిస్తున్నారని వెల్లడైంది. ఆఫీసులకు దగ్గరగా ఉండేందుకు వారు చేస్తున్న ప్రయత్నాల కారణంగా డిమాండ్ పెరిగి రెండు బెడ్ రూమ్ ల ఇంటి అద్దె రూ.20-32 వేలకు చేరుకోగా.. ఇక 3BHKల అద్దె రూ.30 నుంచి 45 వేల వరకు పెరిగిపోయింది. కొత్త ఇల్లు కొనుక్కున్నా దానికి చెల్లించే బ్యాంక్ ఈఎంఐ కూడా ఇంత ఉండదంటూ ఉద్యోగులు వాపోతున్నారు. ఇంత అద్దెలు చెల్లించలేక సింగిల్ బెడ్ రూమ్ ఇళ్లకోసం అన్వేషిస్తున్న ప్రజలకు భారీ కొరత నిరాశను మిగులుస్తోంది.
ప్రస్తుతం ఇంత భారీ స్థాయిలో అద్దెలు ఉండటంతో చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం ఉన్న ఉద్యోగాల కోసం వెతుక్కుంటున్నారు. ఇక ఇటీవల కోకాపేట్ భూముల రేట్లు ధనికులకు సైతం అందరి స్థాయికి చేరుకోవటంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ అద్దెలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. 3BHK రూ.33 వేలు, 2BHKల అద్దె రూ.24 వేలుగా ఉన్నాయి. ఇవి రానున్న కాలంలో మరింతగా పెరగొచ్చని రియల్టీ నిపుణులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications