Robert Kiyosaki: డబ్బు ఒక్కటే ఉంటే చాలదు.. రాబర్ట్ కియోసాకి కీలక వ్యాఖ్యలు..!
ప్రముఖ ఇన్వెస్టర్, రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆర్థిక అంశాల గురించి తన ఫాలోవర్స్ ను అప్రమత్తం చేస్తారు. కియోసాకి ముఖ్యంగా బంగారం, వెండి, రియల్ ఎస్టేట్ తో పాటు స్టాక్ మార్కెట్ పై ఎక్కువగా పోస్టులు పెడుతుంటారు. తాజాగా ఆయన కీలక పోస్ట్ చేశారు. డబ్బు విషయంలో ముందుగానే సిద్ధంగా ఉండటం ఎందుకు ముఖ్యమో తెలిపారు. ఆయన ప్రిప్పర్ అనే పదాన్ని వాడారు. ప్రిప్పర్ అంటే భవిష్యత్తులో ఏదైనా సమస్య లేదా అత్యవసర పరిస్థితి వస్తే దాన్ని ఎదుర్కోవడానికి ముందుగానే సిద్ధంగా ఉండే వ్యక్తి అని వివరించారు.
అయితే ప్రిప్పర్ పదం వాడితే ఎప్పుడూ ఏదో చెడు జరుగుతుందని ఆలోచిస్తున్నట్టే కదా?, పాజిటివ్‌గా ఆలోచించడం మంచిది కాదా? అని ఓ మహిళా తనను ప్రశ్నించిందని గుర్తు చేశారు. సమాధానంగా
కియోసాకి కారు ఇన్సూరెన్స్ ఉదాహరణగా వివరించారు. తాను మీకు కారుకు ఇన్సూరెన్స్ ఉందా? అని అడిగానని. దానికి ఆమె తన కారుకు ఇన్సూరెన్స్ ఉందని చెప్పారని పేర్కొన్నారు. ఆ వెంటనే మీకు యాక్సిడెంట్ జరగాలని కోరుకుంటున్నారా? అని అడిగాని తెలిపారు. అందుకు ఆమె.. లేదు. కానీ ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే నష్టాన్ని ఎదుర్కోవడానికి ఇన్సూరెన్స్ తీసుకున్నానని చెప్పారని గుర్తు చేశారు.

ఇక్కుడ ముందుజాగ్రత్త తీసుకోవడం అంటే.. చెడు జరగాలని కోరుకోవడం కాదని రాబర్ట్ కియోసాకి తెలిపారు. చెడు జరిగితే దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండటం. కారు విషయంలో ఇన్సూరెన్స్ తీసుకున్నట్లే, ఆర్థిక విషయాల్లో కూడా ముందుగానే రక్షణ కలిగి ఉండాలని సూచించారు. తర్వాత కియోసాకి బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి ఆస్తులు ఉన్నాయా అని ఆ మహిళను ప్రశ్నించారు. ఆమె దగ్గర అవేవీ లేవని ఆమె చెప్పింది. ఒకవేళ ఆర్థిక వ్యవస్థలో పెద్ద సంక్షోభం వస్తే మీ డబ్బుకు ఏమవుతుందని కియోసాకి అడిగారు. అప్పుడు ప్రభుత్వం మరింత డబ్బును ముద్రిస్తుందని ఆమె పేర్కొన్నారు.
ఆర్థిక వ్యవస్థలో ధరలు పెరిగినప్పుడు అదే మొత్తంలో డబ్బుతో గతంలో కొనగలిగిన వస్తువులను కొనడం కష్టమవుతుందని రాబర్ట్ కియోసాకి తెలిపారు. దీనినే సాధారణంగా ద్రవ్యోల్బణం అంటారని చెప్పారు. ఉదాహరణకు ఈరోజు రూ.100తో కొనగలిగిన వస్తువు కోసం.. రాబోయే రోజుల్లో రూ.120 లేదా రూ.150 చెల్లించాల్సి వస్తే, మన డబ్బు విలువ సంఖ్యలో అలాగే ఉన్నప్పటికీ దాని కొనుగోలు శక్తి తగ్గినట్టే కాదా అని పేర్కొన్నారు. అందుకే మన సంపద మొత్తాన్ని ఒకే రకమైన డబ్బు లేదా ఒకే ఆస్తిపై పెట్టుబడిగా పెట్టకూడదని గుర్తు చేశారు. ప్రభుత్వం సృష్టించగలిగే కరెన్సీతో పాటు ఇతర రకాల ఆస్తులను కూడా కలిగి ఉండాలనన్నారు. అందుకే బంగారం లాంటి లోహాల్లో పెట్టుబడి పెట్టాలని గతంలో చెప్పారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
