Robert Kiyosaki: తెలివైన పెట్టుబడిదారుడు బంగారంపై పెట్టుబడి పెడతాడు.. రాబర్ట్ కియోసాకి ఆసక్తికర వ్యాఖ్యలు..!
ప్రముఖ ఇన్వెస్టర్, రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తన ఫాలోవర్స్ కు సలహాలు, సూచనలు ఇస్తుంటారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్, బంగారం, వెండి, బిట్ కాయిన్లు, రియల్ ఎస్టేట్, బిజినెస్ గురించి పలు రకాల ఆసక్తికరమైన అంశాలని తన ఫాలోవర్స్ తో పంచుకుంటారు. ఆయన బంగారం కొనుగోలు ఎప్పుడు బుల్లిష్ గానే ఉంటారు. అందుకే ఆయన ఎప్పటి నుంచో పసిడిని కొనుగోలు చేస్తున్నారు. అలాగే వెండి కొనుగోలు చేస్తున్నారు. బిట్ కాయిన్లలో కూడా పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. తాజా రాబర్ట్ కియోసాకి సోషల్ మీడియా వేదికగా మరోసారి స్పందించారు.
అమెరికా మరోసారి క్వాంటిటేటివ్ ఈజింగ్ పేరుతో డాలర్లను ముద్రించేందుకు సిద్ధమవుతోందని రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు. అమెరికా ట్రెజరీ తీసుకునే ఇలాంటి చర్యలతో డాలర్ కొనుగోలు శక్తిని సూచించే డీఎక్స్‌వై సూచీ పడిపోతుందని హెచ్చరించారు. దీంతో ద్రవ్యోల్బణం పెరుగుతుందని అంచనా వేశారు. డాలర్లలో పొదుపు చేసుకునే వారే అధికంగా నష్టపోతారని తెలిపారు. ఆర్థికంగా అవగాహన ఉన్న పెట్టుబడిదారులు విలువ పెరిగే బంగారం, వెండి, బిట్‌కాయిన్, కొంత రియల్ ఎస్టేట్ వంటి ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టి సంపదను పెంచుకుంటారని వివరించారు. ఆర్థిక పరిజ్ఞానం లేని వారు విలువ కోల్పోయే ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టి నష్టపోతారని వివరించారు.

బంగారం ధర $10,000, వెండి ధర $200కి చేరుకుంటుందని తనకు తెలిసిన నిపుణులు అంచనా వేశారని రాబర్ట్ కియోసాకి ఇప్పటికే ప్రకటించారు. తాను ప్రస్తుతం బంగారం కంటే వెండికే ప్రాధాన్యత ఇస్తున్నానని తెలిపారు. అమెరికా ద్రవ్యోల్బణం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు లేదా తగ్గదుల నిర్ణయాలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆగస్టులో అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు అంచనాలకు అనుగుణంగా ఉన్నాయని గుర్తు చేశారు. దీంతో సెప్టెంబరులో రేట్ల పెంపు అవకాశాలు ఉండవన్న అంచనాలతో బంగారం ధర 4,400 డాలర్లకు చేరినట్లు అంచనా వేశారు.
బంగారం ధర పెరుగుదలకు మరో కారణం సెంట్రల్ బ్యాంకులు భారీగా పసిడి కొనుగోలు చేయడమని రాబర్ట్ కియోసాకి వివరించారు. వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు భారీగా పసిడిని కొనుగోలు చేస్తున్నాయని గుర్తు చేశారు. చైనా, జపాన్, భారత్, పోలాండ్, టర్కీ, సింగపూర్ దేశాలు బంగారాన్ని భారీగా కొనుగోలు చేశాయని పేర్కొన్నారు. ముఖ్యంగా చైనా ప్రతి నెలా బంగారం కొనుగోలు చేస్తున్నట్లు తెలిసిందన్నారు. అందుకే పసిడి ధరలు దూసుకెళ్తున్నాయని అభిప్రాయపడ్డారు. అలాగే బంగారం ధర పెరుగుదలతో చాలా మంది గోల్డ్ ఈటీఎఫ్ ల్లో పెట్టుబడి పెడుతున్నారు. ఇది కూడా పసిడి పరుగుకు కారణంగా చెప్పుకొచ్చారు.
తాను ఔన్సు బంగారం 300 డాలర్ల కంటే తక్కువగా ఉన్నప్పటి నుంచే కొనుగోలు చేస్తున్నట్లు గుర్తు చేశారు. వెండి ధర తక్కువగా ఉన్నప్పుడు, బిట్‌కాయిన్‌ను 6,000 డాలర్ల వద్ద ఉన్నప్పుడు కొనుగోలు చేసినట్లు వివరించారు.బంగారం పెట్టుబడి కాదు.. డబ్బు. నిజమైన డబ్బని రాబర్ట్ కియోసాకి స్పష్టం చేశారు. బంగారం విలువ పెరుగుతందే తప్ప తగ్గదన్నారు. ఒక వేళ తగ్గిన స్వల్పకాళిమేనని అభిప్రాయపడ్డారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications