Robert Kiyosaki: అప్పు చేయకుంటే కోటీశ్వరులం కాలేము.. ఎందుకో వివరించిన రాబర్ట్ కియోసాకి..
ఆర్థిక అంశాల గురించి ప్రముఖ ఆర్థిక రచయత, రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయత రాబర్ట్ కియోసాకి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తారు. ఆయన బంగారంపై పెట్టుబడులు, స్టాక్ మార్కెట్లు, బిట్ కాయిన్లకు సంబంధించి పోస్టులు చేస్తారు. తాజాగా ఆయన అప్పుల గురించి పోస్ట్ చేశారు. అప్పులు చేసిన వారే త్వరగా ధనవంతులు అవుతారని అన్నారు. అప్పు చేసినవాళ్లలో చాలా మంది వాటి నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తారని చెప్పారు. అప్పుల ఊబి నుంచి బయటకు రావడమే ఆర్థిక స్వేచ్ఛ అని భావిస్తారని రాబర్ట్ కియోసాకి తెలిపారు.
అయితే కోటీశ్వరులు ఎప్పుడూ అలా ఆలోచించరని ఆయన అన్నారు. అందుకే మధ్యతరగతి వారు ఎప్పటికీ కోటీశ్వరులు కాలేరని తెలిపారు. ఆర్థిక వ్యవస్థలో డబ్బు అప్పుల ద్వారానే సృష్టిస్తారని తెలిపారు. ఎవరైనా అప్పు చేయకుండా ఉండాలని చూస్తే.. వారంతా ఆర్థిక వ్యవస్థ బయట బతుకుతున్నట్లేనని అన్నారు. బ్యాంకులు, ప్రభుత్వాలు, మన విద్యా వ్యవస్థలు ఎప్పుడూ చెప్పని కొన్ని ఆర్థిక రహస్యాలను రాబర్ట్ కియోసాకి బయట పెట్టారు. ప్రస్తుతం అగ్ర రాజ్యం అమెరికా అప్పు 40 ట్రిలియన్ డాలర్లుగా ఉందని ఆయన గుర్తు చేశారు.

వరల్డ్ లోనే ధనిక దేశమైన అమెరికా ప్రభుత్వం కూడా అప్పులు చేస్తుందని అన్నారు. అప్పు లేని వ్యవస్థ ముందుకెళ్లడం కష్టమని అన్నారు. సంపన్న దేశమైన అమెరికానే అప్పులు చేస్తున్నప్పుడు.. సామాన్యులు అప్పులు ఎందుకు చేయకూడదన్నారు. సామాన్యులు అప్పులను చూసి భయపడొద్దని చెప్పారు. అయితే అప్పు చేసి ఇష్టమున్నట్లు చేస్తే కుదరదన్నారు. ఆర్థిక అవగాహనతోనే అప్పులు చేయాలన్నారు. అవగాహన లేకుండా అప్పులు చేసి విలాసాలకు ఖర్చు చేస్తే అప్పు తిరిగి చెల్లించలేరని అన్నారు.
అప్పు చేసి కార్లు, ఖరిదైన బట్టలు కొడనం చేస్తే మీకు ఆర్థిక అవగాహన లేనట్లేనని అన్నారు. అప్పు చేసిన సొమ్మును అప్పును రియల్ ఎస్టేట్, వ్యాపారాలు, లేదా నిలకడగా ఆదాయాన్నిచ్చే ఆస్తులను కొనుగోలు చేయడానికి ఉపయోగించాలని అన్నారు. అప్పుడే ధనవంతులము అవుతామని పేర్కొన్నాడు. ధనవంతుడు ఎప్పుడైనా స్వయంగా అప్పు కట్టడు. అద్దెలు కట్టే కిరాయిదారులు లేదా వ్యాపారంలో వచ్చే సంపాదన ద్వారా ఆ అప్పు తీరిపోతుందని గుర్తు చేశారు. ఎప్పుడైతే అప్పు మీ కోసం పనిచేసి, మీకు డబ్బు తెచ్చిపెడుతుందో.. అప్పుడే అది సంపదను సృష్టించే ఒక మిషన్ మాదిరిగా మారుతుందని వివరించారు.
అంతేకాకుండా అప్పు మీద ఎలాంటి పన్ను ఉండదని అన్నారు. కోటి రూపాయల అప్పు తీసుకున్నా పన్ను వసూలు చేయరని గుర్తు చేశారు. అందుకే ధనవంతులు తమ దగ్గరున్న ఆస్తులను బ్యాంకులో తాకట్టు పెట్టి అప్పు తీసుకుంటారని వివరించారు. ఆ డబ్బుతో మరిన్ని కొత్త ఆస్తులను కొనుగోలు చేసి మరింత ఆదాయం పొందుతారని పేర్కొన్నారు. ఆ ఆస్తుల ద్వారా వచ్చే అద్దెలు లేదా ఆదాయంతోనే అప్పు చెల్లిస్తారని పేర్కొన్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications