Robert Kiyosaki: జీవితంలో ఫెయిల్యూర్సే గొప్ప పాఠాలు.. అపజయం లేని విజయం ఉండదన్న రాబర్ట్ కియోసాకి..!

ప్రముఖ ఆర్థిక నిపుణుడు, రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. తన ఫాలోవర్స్ కు సలహాలు, సూచనలు ఇస్తుంటారు. జీవిత పాఠాలను కూడా వివరిస్తుంటాడు. ఆయన ఎక్కువగా పెట్టుబడి గురించి చెబుతుంటారు. బంగారం, వెండి, రాగి, బిట్ కాయిన్, స్టాక్ మార్కెట్, పర్సనల్ ఫైనాన్స్ గురించి వివరిస్తుంటాడు. తాజాగా జీవితంలో ఫెయిల్యూర్స్ గురించి ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. లైఫ్ లో ఫెయిల్యూర్ అంటే చాలామందికి భయం ఉంటుందన్నారు. ఎందుకంటే.. ఏదైనా పని మొదలుపెట్టే ముందు ఇది ఫెయిల్ అయితే?'' అనే ఆలోచనే ఎక్కువగా ఉంటుందని గుర్తు చేశాడు.

అందుకే చాలా మంది రిస్క్ తీసుకోకుండా సేఫ్‌గా ఉండటానికే ప్రయత్నిస్తారు పేర్కొన్నారు నిజానికి ఫెయిల్యూర్ అనేది అంతం కాదని గుర్తుంచుకోవాలని చెప్పారు. మనం చేసిన తప్పుల నుంచి నేర్చుకునే ఒక అవకాశమని తెలిపారు. 25 ఏళ్ల వయసులో తన మొదటి బిజినెస్ పూర్తిగా దెబ్బ తిన్నట్లు వివరించారు. అప్పులు కూడా అయినట్లు చెప్పారు. అప్పుడు చాలా భయపడినట్లు గుర్తు చేశారు. అయితే ఫెయిల్ అవ్వడమంటే.. మరో సక్సెస్ కు నాంది అని పేర్కొన్నారు. నష్టాల్లోకి వెళ్తున్న బిజినెస్ ను కాపాడాలని ప్రయత్నించినట్లు చెప్పారు. అది నాకు చాలా పాఠాలు నేర్పిందని చెప్పారు.

Robert Kiyosaki

ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సి విషయం ఏమిటంటే.. నువ్వు ఫెయిల్ అయితే లైఫ్ ఫెయిల్ అయినట్లు కాదన్నారు. బిజినెస్ లో ఫెయిల్ అయినా, చదువులు ఫెయిల్ అయినా చివరికి లవ్ లో ఫెయిల్ అయినా జీవితమే ఫెయిల్ అయిందని అనుకోవద్దని సూచించారు. ఫెయిల్ అయినప్పుడు చుట్టూ ఉన్నవారు ఎన్నో అంటారని.. వాటి గురించి ఆలోచించ్చొద్దని అన్నారు. ఒకసారి ఓడిపోతే మనలో సామర్థ్యం లేదని భావిస్తాం. అందుకే ..సేఫ్ జాబ్‌లోనే ఉండిపోతాం, కొత్త బిజినెస్ మొదలుపెట్టడానికి భయపడతాం, రిస్క్ ఉన్న పెట్టుబడులకు దూరంగా ఉంటామని కియోసాకి వివరించారు.

అయితే ప్రయత్నించకపోవడం కూడా ఒక రకమైన నష్టమేనని వివరించారు. ఎందుకంటే ప్రయత్నిస్తే ఫెయిల్ కావచ్చు.. కానీ ప్రయత్నించకపోతే ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం మనకు ఉండదని పేర్కొన్నారు. మొదటి బిజినెస్ ఫెయిల్ అయిన తర్వాత తన తప్పులను ఒక్కొక్కటిగా విశ్లేషించుకున్నట్లు గుర్తు చేశారు. డబ్బును సరిగ్గా నిర్వహించకపోవడం, సరైన బిజినెస్ భాగస్వాములను ఎంచుకోకపోవడం, కొద్దిమంది కస్టమర్లపైనే ఎక్కువగా ఆధారపడటం వంటి విషయాల నుంచి పాఠాలు నేర్చుకున్నట్లు వివరించారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+