Robert Kiyosaki: ఇల్లుతో మరో ఇల్లును కొనుగోలు చేయవచ్చన్న రాబర్ట్ కియోసాకి..!
ఆర్థిక నిపుణుడు, రిచ్ డాడ్, పూర్ డాడ్ పుస్తక రచయిత తన ఫాలోవర్స్ కు పలు సలహాలు, సూచనలు చేస్తుంటాడు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్టులు చేస్తుంటాడు. ముఖ్యంగా బంగారం, వెండి, బిట్ కాయిన్స్, అప్పులు, పెట్టుబడి మార్గాలు గురించి వివరిస్తుంటాడు. బ్యాంకులు, రుణాలు, పెట్టుబడుల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. డబ్బును కేవలం దాచుకోవడం కంటే, అది మన కోసం పనిచేసేలా చేయడం ముఖ్యమని రాబర్ట్ కియోసాకి వివరించారు. తాజాగా సొంత ఇంటి గురించి రాబర్ట్ కియోసాకి వివరించారు. ఇంటిని తెలివిగా ఉపయోగించుకుంటే.. అదనపు ఆదాయాన్ని సమకూర్చే సాధనంగా మార్చుకోవచ్చని రాబర్ట్ కియోసాకి వివరించారు.
ఈ మేరకు ఆయన తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో ఇంటిని విక్రయించకుండానే దానిలో ఉన్న ఈక్విటీని ఉపయోగించి ఆదాయాన్ని పెంచుకునే మార్గాన్ని పేర్కొన్నారు. క్యాష్-అవుట్ రీఫైనాన్స్ ఆయన వివరించారు. ఉదాహరణకు పదేళ్ల క్రితం ఓ వ్యక్తి 3 లక్షల డాలర్లకు ఇల్లు కొనుగోలు చేశాడని తెలిపారు., అందులో 60 వేల డాలర్లు డౌన్‌పేమెంట్‌గా చెల్లించి, 2.4 లక్షల డాలర్ల రుణం తీసుకున్నాడని వివరించాడు. ప్రస్తుతం ఆ ఇంటి విలువ 5 లక్షల డాలర్లకు చేరి, ఇంటి రుణం 1.8 లక్షల డాలర్లకు తగ్గితే.. యజమానికి 3.2 లక్షల డాలర్ల ఈక్విటీ ఉన్నట్లవుతుందని పేర్కొన్నాడు.

ఈక్విటీలో కొంత భాగాన్ని నగదుగా మార్చుకునేందుకు రీఫైనాన్స్ చేసుకోవచ్చని కియోసాకి గుర్తు చేశాడు. కొత్తగా 3 లక్షల డాలర్ల రుణం తీసుకుంటే పాత 1.8 లక్షల డాలర్ల రుణం చెల్లించిన తర్వాత 1.2 లక్షల డాలర్లు నగదుగా చేతికి వస్తాయని వివరించాడు. ఈ మొత్తాన్ని ఆదాయం అందించే ఆస్తిలో పెట్టుబడిగా పెట్టవచ్చని చెప్పారు. దానికి ఉదాహరణ కూడా వివరించారు.
ఉదాహరణగా 4 లక్షల డాలర్లకు డ్యూప్లెక్స్ కొనుగోలు చేసి, 1.2 లక్షల డాలర్లను డౌన్‌పేమెంట్‌గా చెల్లిస్తే మిగిలిన మొత్తానికి బ్యాంకు రుణం తీసుకోవచ్చని పేర్కొన్నారు.
రెండు యూనిట్ల నుంచి నెలకు మొత్తం 3,600 డాలర్ల అద్దె వస్తే, రుణం, పన్నులు, బీమా, నిర్వహణ ఖర్చులు పోగా సుమారు 1,000 డాలర్ల నికర నగదు ప్రవాహం ఉంటుందని తెలిపారు. అదే సమయంలో ఇంటి రీఫైనాన్స్ వల్ల నెలవారీ చెల్లింపు 800 డాలర్లు పెరిగినా.. అద్దె ఆస్తి నుంచి వచ్చే ఆదాయం దాన్ని అధిగమించవచ్చని పేర్కొన్నారు. అయితే ఇది అన్ని సమయాల్లో వర్కవుట్ కాదని కొంద మంది నెటిజన్లు పేర్కొంటున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications