Robert Kiyosaki: ధనవంతుడు అంటే ఎవరు.. అసలు విషయం చెప్పిన రాబర్ట్ కియోసాకి..!
నెలకు లక్ష రూపాయల జీతం వస్తుంది.. ఆయన కోటిశ్వరుడు అంటాం. రోజుకు రూ.5 వేలు సంపదిస్తున్నాడు. ఆయన ధనవంతుడు అని అంటాం. కానీ సంపన్నుడికి, ధనవంతుడికి అసలైన నిర్వచనం చెప్పారు ప్రముఖ ఆర్థిక రచయత, రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయత రాబర్ట్ కియోసాకి. ధనవంతుడు, సంపన్నుడు అనే పదాలను దాదాపు అందరు ఒకే అర్థంలో తీసుకుంటారని ఆయన అన్నారు. కానీ ధనవంతుడు, సంపన్నుడికి చాలా తేడా ఉందని వివరించాడు. దానికి ఉదాహరణ కూడా ఇచ్చారు.
నెలకు రూ.లక్ష సంపాదించే వ్యక్తి సంవత్సరానికి రూ.12 లక్షలు సంపాదిస్తాడు. మరో వ్యక్తి నెలకు రూ.3 లక్షలు జీతం వస్తే.. ఏడాదికి రూ.36 లక్షలు సంపాదిస్తాడు. అలాగే ఒక వైద్యుడు నెలకు రూ.5 లక్షలకు సంపాదిస్తాడు. అంటే సంవత్సరానికి రూ.60 లక్షల సంపాదన వస్తుంది. అయితే ఈ ముగ్గురు తమ పని చేయడం ఆపేస్తే.. ఉద్యోగులు జీతం రాదు, వైద్యుడికి డబ్బులు రావు. అంటే వీరికి పని చేస్తేనే డబ్బులు వస్తాయి. రోజులు గడుస్తాయని చెప్పారు. అయితే ఆస్తుల ద్వారా నిరంతరం ఆదాయం పొందే వ్యక్తి.. పని చేయకపోయినా డబ్బులు వస్తాయని గుర్తు చేశారు.

ఆ వ్యక్తి పెట్టుబడులు, వ్యాపారాలు, ఆస్తులు అతనికి ఆదాయాన్ని అందిస్తాయని వివరించారు. అందుకే ధనవంతుడు కావాలంటే.. భారీ జీతం తీసుకుంటే సరిపోదు. భారీగా సంపాదించిన సరిపోదు. భవిష్యత్ లో ఆదాయాన్ని ఇచ్చే ఆస్తులను కూడగట్టాలని రాబర్ట్ కియోసాకి సూచించారు. అద్దెకు ఇచ్చే ఇల్లు, వ్యాపారం, పెట్టుబడులు వంటి ఆస్తులు మనకు నిరంతర ఆదాయాన్ని అందిస్తాయని గుర్తుంచుకోవాలన్నారు. ధనవంతుడు ఎంత సంపాదిస్తున్నానని మాత్రమే ఆలోచిస్తాడని.. కానీ సంపన్నుడు తనకు ఆదాయం వచ్చే ఆస్తులు ఎన్ని ఉన్నాయా అని ఆలోచిస్తాడని వివరించారు. ఎవరైనా సంపాదిస్తారని.. కానీ దాన్ని సరైన విధానంలో పెట్టుబడి పెడితే భవిష్యత్ లో మంచి ఆదాయం వస్తుందని తెలిపారు.
అయితే సంపాదన ఒక్కటే కాదు.. ఆ డబ్బును పొదుపు చేస్తేనే కోటీశ్వరుడు అవుతారని బెంగళూరుకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ మీనాల్ గోయెల్ చెబుతున్నారు. నీకు ఎంత జీతం వచ్చినా.. పొదుపు లేకుంటే కోటీశ్వరుడు కావడం సాధ్యం కాదని వివరిస్తున్నారు. ఆర్థిక క్రమ శిక్షణ, ఖర్చుల నియంత్రణ, దీర్ఘకాలిక పెట్టుబడులే అసలైన సంపదకు మార్గమని పేర్కొన్నారు. చాలా మందికి ఆదాయం పెరిగే కొద్దీ ఖర్చు కూడా పెరుగుతుందని చెప్పారు. ఇది చాలా మందికి సమస్యగా ఉంటుందని పేర్కొన్నారు. కొంత మంది జీతం పెరిగితే.. వారు అధిక రెంట్ ఉన్న ఇంట్లోకి మారుతారు. లేదంటే ఈఎంఐపై కార్లు కొనుగోలు చేస్తారు. రెగ్యులర్ గా బయట తినడం చేస్తారు. లైఫ్ స్టైల్ ను మారుస్తారు. దీని వల్ల ఎలాంటి మార్పు ఉండదని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications