Inox Wind Shares: ప్రస్తుతం భారతదేశంలో రెన్యూవబుల్ ఎనర్జీ రంగాలకు చెందిన కంపెనీల షేర్లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. భవిష్యత్తు విద్యుత్ అవసరాలను తీర్చటంలో విండ్, సోలార్ వంటి గ్రీన్ ఎనర్జీపై ప్రభుత్వాలు దృష్టిపెట్టడంతో ఈ రంగంలోని కంపెనీలపై ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. అయితే ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ రెన్యూవబుల్ ఎనర్జీకి వ్యతిరేకంగా ఉండటంతో దేశీయ కంపెనీలు కొంత ఆందోళన చెందుతున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది విండ్ ఎనర్జీ రంగంలో పరిష్కారాలను అందిస్తున్న ఐనాక్స్ విండ్ లిమిటెడ్ కంపెనీ గురించే. తాజాగా కంపెనీ కాంటినమ్ గ్రీన్ ఎనర్జీ నుంచి 87 మెగావాట్ల ఆర్డర్‌ను అందుకున్నట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్స్ ద్వారా వెల్లడైంది. దీంతో కంపెనీ షేర్లు నష్టాల్లో నుంచి లాభాల్లోకి చేరుకోవటానికి దోహదపడ్డాయి. దీంతో ఉదయం 11.45 గంటల సమయంలో కంపెనీ షేర్లు ఒక్కోటి రూ.205.40 వద్ద కొనసాగుతున్నాయి. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ ప్రస్తుతం రూ.26,740 కోట్లుగా ఉంది. కాంటినమ్ నుండి రిపీట్ ఆర్డర్ పొందినట్లు కంపెనీ వెల్లడించింది.

3 MW విండ్ టర్బైన్ జనరేటర్ కోసం ఈ ఆర్డర్ ఎండ్-టు-ఎండ్ టర్న్‌కీ ప్రాతిపదికన ఐనాక్స్ విండ్ అందుకుంది. ఈ ప్రాజెక్ట్‌ను గుజరాత్, రాజస్థాన్‌లలో కంపెనీ అమలు చేయనుందని తెలుస్తోంది. తాజా ఆర్డర్ ద్వారా కాంటినమ్ నుంచి మొత్తం క్యుములేటివ్ ఆర్డర్‌లు 700 మెగావాట్లకు చేరుకోనున్నాయి. ఇదే క్రమంలో ఐనాక్స్ విండ్ మెుత్తం ఆర్డర్ బుక్‌ను 3.4 GW కంటే ఎక్కువకు చేరుకుంటుందని తెలుస్తోంది. తాము స్పెక్ట్రమ్‌లోని కస్టమర్‌ల నుండి బలమైన డిమాండ్ కలిగి ఉన్నట్లు గ్రూప్ సీఈవో కైలాష్ తారాచందానీ పేర్కొన్నారు. డెవలపర్లు ఇప్పుడు హైబ్రిడ్/రౌండ్-ది-క్లాక్/లో ఉన్నారు. FDRE సొల్యూషన్ పవన సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు.
గడచిన ఏడాది కాలంలో ఐనాక్స్ స్టాక్ తన పెట్టుబడిదారులకు మల్టీబ్యాగర్ రాబడులను అందించింది. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు ఏకంగా 220 శాతానికిపైగా రాబడులను అందుకున్నారు. ఇక దీర్ఘకాలిక పెట్టుబడిదారులు సైతం కంపెనీ షేర్ల నుంచి మల్టీ ఫోల్డ్ రాబడులను పొందారు. ఐదేళ్ల కాలంలో పెట్టుబడిదారులు 2381 శాతం అద్భుతమైన రాబడిని అందుకున్నారు. ప్రస్తుతం స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.261.90గా ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.60.20 వద్ద కొనసాగుతోంది.
Note: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

Bengaluru: గ్యాస్ సిలిండర్ లేకుండా ఈ దంపతులు ఎలా జీవిస్తున్నారో చూడండి!

Bengaluru: బెంగళూరు టూ హైదరాబాద్ బుల్లెట్ రైలు.. ఇక విమాన వేగంతో ప్రయాణం!

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరుగుదలపై షాకింగ్ న్యూస్..అసలైన కారణం తెలిపిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజినల్ సీఈఓ సచిన్ జైన్..

Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు ‘లండన్' సొల్యూషన్.. ఇకపై కంజెషన్ ట్యాక్స్!

1 Crore: 10 ఏళ్లలో రూ. 1 కోటి..! రిస్క్ లేకుండా కోటీశ్వరులు అయ్యే ప్లాన్ ఇదే!

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్‌కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications