Bonus Shares: ఒక్క షేరుంటే 3 షేర్లు ఫ్రీ.. 20 శాతం పెరిగిన స్టాక్.. డివిడెండ్ కూడా ఇస్తోంది..
Remus Pharmaceuticals: నేడు మార్కెట్లో ఇన్వెస్టర్లు ఫార్మా రంగానికి చెందిన రెమస్ ఫార్మాస్యూటికల్స్ షేర్లపై దృష్టి సారించారు. ఒకేసారి కంపెనీ తన ఇన్వెస్టర్లకు రెండు శుభవార్తలు చెప్పటంతో ఇన్వెస్టర్ల కంపెనీ షేర్లను కొనుగోలు చేసేందుకు ఎగబడ్డారు.
వివరాల్లోకి వెళితే నేడు ఇంట్రాడేలో రెమస్ ఫార్మాస్యూటికల్స్ స్టాక్ ఏకంగా 20 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్ తాకింది. దీంతో కంపెనీ షేర్లు కొత్త 52 వారాల గరిష్ట స్థాయి రూ.8,294.10కి చేరుకున్నాయి. దీనికి ముందు నిన్న కంపెనీ షేర్లు రూ.6,911.75 వద్ద ముగియగా.. ఇంట్రాడేలో 20 శాతం అంటే రూ.1,382.35 ఒక్కో షేరు ధర నేడు పెరిగింది. కంపెనీ తన ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లను ప్రకటించటంతో పెరుగుదల నమోదైంది.

కంపెనీ ఈక్విటీ షేర్‌హోల్డర్‌లకు 3:1 నిష్పత్తిలో బోనస్ షేర్‌లను జారీ చేయడానికి దాని బోర్డు సభ్యుడు ఆమోదం తెలిపినట్లు స్టాక్ మార్కెట్‌కు తెలియజేసింది. దీని ప్రకారం కంపెనీలో ఒక్కో షేరు కలిగి ఉన్న అర్హత కలిగిన ఇన్వెస్టర్లు మూడు షేర్లను ఉచితంగా బోనస్ రూపంలో అందుకుంటారు. ఇదే క్రమంలో కంపెనీ 2024 ఆర్థిక సంవత్సరాని షేరుపై రూ.4 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. డివిడెండ్ పొందేందుకు రికార్డు తేదీని మే 2గా నిర్ణయించినట్లు ప్రకటించింది. కంపెనీ పుస్తకాల్లో ఈ తేదీ నాటికి పేరు కలిగిన ఇన్వెస్టర్లు కంపెనీ అందించే డివిడెండ్‌కు అర్హులు.
మే 2023లో ఎన్‌ఎస్‌ఈ ఎమర్జ్ ప్లాట్‌ఫామ్‌లో లిస్టింగ్ అయినప్పటి నుంచి రెమస్ ఫార్మా షేర్లు 385 శాతం లాభపడ్డాయి. రెమస్ ఫార్మా షేర్లు ఏడాది ప్రాతిపదికన 7 శాతం పెరిగాయి. సెప్టెంబర్ 2023తో ముగిసిన కాలానికి రెమస్ ఫార్మా రూ.29 కోట్ల టర్నోవర్‌తో రూ.8 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. సెప్టెంబరు 2023 త్రైమాసికంతో పోల్చితే ప్రమోటర్లు, ఎఫ్‌ఐఐలు కంపెనీలో తమ వాటాను స్వల్పంగా పెంచుకున్నారని మార్చి 2024 షేర్‌హోల్డింగ్ ప్రకారం వెల్లడైంది. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్లు 70.60 శాతం వాటా హోల్డ్ చేస్తుండగా.. ఎఫ్ఐఐలు 3.25 శాతం వాటాలను కలిగి ఉన్నారు.


Click it and Unblock the Notifications