Aadhaar-PAN News: దేశంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ బూమ్ కొనసాగుతోంది. కరోనా మహమ్మారి తర్వాత ప్రజలు సొంతింటి కొనుగోలుకు ఎక్కువగా మెుగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో మారిన రూల్స్ పన్ను చెల్లింపు విషయంలో భారీ ఊరటను కల్పిస్తున్నాయి.
ఆదాయపు పన్ను శాఖ ప్రస్తుతం గృహ కొనుగోలుదారులకు అదనపు TDS కట్టింగ్ నుంచి తక్షణ ఉపశమనం ఇచ్చింది. మారిన రూల్స్ ప్రకారం ఆస్తిని విక్రయించే సెల్లర్స్ మే 31లోపు తమ పాన్-ఆధార్‌ను లింక్ చేయాల్సి ఉంటుంది. దీనిని పూర్తి చేయటంలో సెల్లర్ డిఫాల్ట్ అయితే కొనుగోలుదారు పెరిగిన రేటుతో అదనపు TDS చెల్లించాలి. దీనిని పాటించని కొందరు ప్రాపర్టీ సెల్లర్లకు ఆదాయపు పన్ను శాఖ ఇప్పటికే నోటీసులు కూడా పంపించింది. ఆధార్-పాన్ లింకింగ్ రూల్స్ కారణంగా కొనుగోలుదారులు అందుకుంటున్న అన్యాయమైన పన్ను నోటీసులను తొలగించుకోవటంలో ఉపయోగపడనుందని నిపుణులు చెబుతున్నారు.

గత ఏడాదిలో కొనుగోలు చేసిన ప్రాపర్టీకి అదనపు టీసీఎస్ చెల్లించాలని కోరుతూ ఆదాయపు పన్ను శాఖ నుంచి దాదాపు 16,000 మంది హోమ్ బయ్యర్లు నోటీసులు అందుకున్నారు. ఆస్తిని విక్రయించిన సదరు విక్రేతల పాన్ నంబర్లు ఇన్‌యాక్టివ్‌గా ఉన్నాయని లేదా ఆధార్‌తో లింక్ చేయలేదని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఈ పరిస్థితిలో చట్టప్రకారం కొనుగోలుదారు అదనపు పన్ను చెల్లించాల్సి వచ్చింది. అయితే తాజాగా జారీ అయిన సర్క్యులర్ ప్రకారం అదనపు టీడీఎస్ విషయంలో పెద్ద ఉపమనం ఇచ్చింది. ప్రాపర్టీ విక్రేతలకు తమ పాన్-ఆధార్ కార్డ్ లింక్ చేసేందుకు మే 31, 2024 వరకు సమయం ఇచ్చింది. ఈ క్రమంలో పన్ను నోటీసును తిరస్కరించడానికి కొనుగోలుదారు తన పాన్‌ను తన ఆధార్‌తో లింక్ చేయమని ఆస్తి విక్రేతను అభ్యర్థించవలసి ఉంటుంది.
పన్ను నిబంధనల ప్రకారం ఎవరైనా వ్యక్తి కొనుగోలు చేసే ఆస్తి విలువ రూ.50 లక్షల కంటే ఎక్కువ ఉంటే.. గృహ కొనుగోలుదారులు అమ్మకపు ధరలో ఒక శాతం టీడీఎస్ మినహాయించి, దానిని ప్రభుత్వానికి డిపాజిట్ చేయాలి. ఆస్తి విక్రేతకు PAN లేకుంటే లేదా పని చేయనిదిగా పరిగణించబడితే టీడీఎస్ 20 శాతానికి పెరుగుతుంది. దీనికి ముందు జూలై 1, 2023లో అమలులోకి వచ్చిన పన్ను నిబంధనల ప్రకారం విక్రేతలు తమ పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయకపోతే.. పాన్ కార్డ్ ఇన్-యాక్టివ్ చేయబడుతుందని ప్రకటించింది. అలా కార్డు లింక్ చేయని పక్షంలో ప్రాపర్టీ కొనుగోలుదారులకు అదనంగా 19 శాతం టీడీఎస్ చెల్లించాలని నోటీసులు ఇవ్వబడతాయి.
వాస్తవానికి ఈ రూల్స్ చాలా మందికి ఇబ్బందిని కలిగిస్తున్నాయి. ఈ విషయంలో పన్ను శాఖ పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేసే బాధ్యత విక్రేతపై ఉంచాలని, కొనుగోలుదారులపై TDS భారం వేయకూడదని నిపుణులు అంటున్నారు. అలాగే తాజాగా అందించిన గడువు తేదీలోగా వారు పాన్-ఆధార్ వివరాలను లింక్ చేయకపోతే నేరుగా విక్రేతకే పన్ను నోటీసులను పంపాలని వారు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న చట్టంలో ఆస్తి కొనుగోలుదారులను పన్ను శాఖ దీనికి బాధ్యులను చేయటంతో.. నోటీసులు అందుకున్న పలువురు గృహ కొనుగోలుదారులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. తమ తప్పులేదంటూ పిటిషన్లలో పేర్కొంటున్నారు. అన్ని చట్టపరమైన నిబంధనలు పాటించినప్పటికీ పన్ను శాఖ నుంచి నోటీసులు వస్తున్నట్లు ఆరోపిస్తున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications