Hero Motorcorp: హీరో మోటార్స్ అధినేతకు ఊరట.. దిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు..
Hero Motorcorp: దేశంలోని ఆటో రంగంలో హీరోమోటార్స్ కంపెనీ ప్రముఖ టూవీలర్ ఉత్పత్తి దారుగా గుర్తింపు పొందింది. అయితే దీని ఎగ్జిక్యూటివ్ చైర్ పర్సన్ పవన్ ముంజల్ ఇటీవల తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో తాజాగా నేడు దిల్లీ హైకోర్టు ఈడీ దర్యాప్తుపై స్టే ఇస్తున్నట్లు తీర్పు వెలువరించింది. హీరో మోటార్స్ విదేశీ మారకాన్ని దుర్వినియోగం చేసిందనే ఆరోపణల నేపథ్యంలో ఇటీవల మనీలాండరింగ్ నిరోధక చట్టాల కింద పవన్ ముంజల్‌కు చెందిన రూ.24.95 కోట్ల ఆస్తులను అటాచ్ చేసిన సంగతి తెలిసిందే. రిజర్వు బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా విదేశాల్లో ఇతరుల పేరుపై ఫారెక్స్ నిల్వలను వ్యక్తిగత ఖర్చుల కోసం వినియోగించినట్లు ఈడీ ఆరోపిస్తోంది. దీనిపై దర్యాప్తు కొనసాగిస్తోంది.

దర్యాప్తుకు మూలాధారమైన డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఫిర్యాదుపై నవంబర్ 3న హైకోర్టు స్టే విధించినందున సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈడీ విచారణపై కూడా స్టే విధించాల్సిన అవసరం ఉందని హైకోర్టు పేర్కొంది. ఈ కేసు ఇప్పుడు మార్చి 21, 2024న విచారణకు వచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి ముంజాల్‌కు సన్నిహితంగా భావిస్తున్న వ్యక్తిపై DRI ఫిర్యాదు నుండి ఈ విచారణ ప్రారంభమైంది. సదరు వ్యక్తి లెక్కల్లో చూపని విదేశీ కరెన్సీని కలిగి ఉన్నారనే ఆరోపణలపై పరిశీలనలో ఉన్నారు.
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఫిర్యాదుపై ఇడి "పిగ్గీ రైడింగ్" చేస్తోందని, అందువల్ల ఈడీ ప్రొసీడింగ్స్‌పై స్టే విధించాలని ముంజల్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఐదేళ్ల కిందట జరిగిన విషయాలపై ప్రస్తుతం విచారణ జరుపుతున్నట్లు రోహత్గీ ధర్మాసనానికి వెల్లడించారు. అయితే ముంజల్ దాదాపు 41 కోట్లకు పైగా లాభపడ్డారని ఈడీ తరఫున న్యాయవాది జోయెబ్ హుస్సేన్ కోర్టుకు వెల్లడించారు. అలాగే కస్టమ్స్ సరిహద్దు వద్ద కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ రూ.81 లక్షలు పట్టుబడిందని హుస్సేన్ కోర్టుకు తెలిపారు. ముంజల్ ప్రకటించని విదేశీ కరెన్సీకి లబ్ధిదారుడని ED నమ్మడానికి కారణాలు ఉన్నాయని హుస్సేన్ వాదించారు.


Click it and Unblock the Notifications