రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యొక్క ఎఫ్‌ఎంసీజీ (FMCG) విభాగమైన రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ పెట్-కేర్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. బుధవారం రోజున రిలయన్స్ తమ కొత్త పెట్ ఫుడ్ బ్రాండ్ అయిన 'వాగీస్' (Reliance Waggies) ను అనౌన్స్ చేసింది.

మనదేశంలో పెట్ ఇండస్ట్రీకి బాగానే డిమాండ్ ఉంది. చాలామంది తమ ఇళ్లల్లో పెట్ జంతువులను పెంచుకుంటుంటారు. దేశవ్యాప్తంగా ఉన్న పెంపుడు జంతువుల యజమానులందరికీ నాణ్యమైన పోషకాహారాన్ని అందుబాటు ధరల్లో అందించడం కోసం రిలయన్స్ ఈ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినట్టు చెప్తోంది.
గ్లోబల్ క్వాలిటీ
కంపెనీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం రిలయన్స్.. అందుబాటు ధరల్లో ప్రపంచ స్థాయి నాణ్యత అందిచడంపై దృష్టి పెట్టింది. పెట్స్ సంరక్షణ కోసం ఇంటి బడ్జెట్‌పై భారం పడకుండా చేయడమే ఈ బ్రాండ్ ఉద్దేశం అని రిలయన్స్ చెప్తోంది.ఇకపోతే ఇండియాలో పెట్ కేర్ ఇండస్ట్రీని మార్చే విధంగా రిలయన్స్ అడుగులు వేస్తుంది. రిలయన్స్ తమ 'వాగీస్' ప్రొడక్ట్స్ ధరలను ఇప్పటికే మార్కెట్లో ఉన్న నెస్లే, మార్స్, గోద్రేజ్ వంటి కంపెనీల కంటే 20-50 శాతం తక్కువగా నిర్ణయించాలని చూస్తోంది.
సైన్స్ బేస్డ్ ఫార్ములా
ఈ కొత్త బ్రాండ్ గురించి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేతన్ మోడీ మాట్లాడుతూ, "తక్కువ ధరలో మెరుగైన పోషణను అందించేందుకు 'వాగీస్' రూపొందించబడింది. ఇందులో అదనపు ప్రొటీన్, డైజెషన్ కు హెల్ప్ అయ్యే ప్రీబయోటిక్స్, అలాగే కీళ్ళు, చర్మం, బొచ్చు వంటి వాటిని ఆరోగ్యంగా ఉంచేందుకు తగిన పోషకాలు ఇందులో ఉంటాయి" అని చెప్పారు.
లక్ష్యం ఇదే..
దేశంలోని ప్రతి పెంపుడు జంతువు సరైన పోషకాహారాన్ని అందుకోవడమే తమ లక్ష్యం అని రిలయన్స్ చెప్తోంది. అలాగే పెట్ కేర్ అనేది యజమానికి భారం కాకూడదని, తమ జేబుకు చిల్లు పడకుండా నాణ్యమైన ఫుడ్ ను తమ పెట్స్ కు అందించగలగడమే మా బ్రాండ్ ఉద్దేశం అని కేతర్ చెప్పుకొచ్చారు.
ధరలు ఇలా..
'వాగీస్' ఫుడ్స్ ను సరసమైన ధరల్లోనే లాంఛ్ చేశారు. 'వాగీస్' బేసిక్ గ్రేడ్ ఫుడ్ ధర కిలో రూ. 199 నుంచి ప్రారంభమవుతుంది. కొత్తగా ట్రై చేయాలనుకునేవారికి 100 గ్రాముల ప్యాక్‌లను రూ. 20 కే అందిస్తున్నారు. అలాగే వాగీస్ ప్రో' అనే ప్రీమియం గ్రేడ్ ఫుడ్ ధర కిలోకు రూ. 249- నుంచి మొదలవుతుంది.
మార్కెట్ ఎలా ఉండొచ్చు?
భారతదేశంలో పెట్-కేర్ మార్కెట్ వేగంగా విస్తరిస్తున్న సమయంలో 'వాగీస్' సరైన ఎంట్రీ ఇచ్చింది. ముఖ్యంగా నగరాల్లో ఇప్పుడిప్పుడే పెంపుడు జంతువుల యాజమాన్యం పెరుగుతోంది. రెడ్ సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ నివేదిక ప్రకారం భారతదేశ పెట్ కేర్ మార్కెట్ ప్రస్తుతం ఉన్న $3.5 బిలియన్ల నుంచి 2028 నాటికి $7 బిలియన్లకు రెట్టింపు అవుతుందని అంచనా. అలాగే 2019లో మనదేశంలోని పెంపుడు జంతువుల సంఖ్య 26 మిలియన్లు ఉండగా 2024లో అది 32 మిలియన్లకు పెరిగింది. ఈ నేపథ్యంలో రిలయన్స్ వాగీస్ బ్రాండ్ కు ఫ్యూచర్ లో మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications