Reliance Jio: ప్రస్తుతం భారతదేశంలో టెలికాం వ్యాపారం చాలా వేగంగా ముందుకు సాగుతోంది. ఒకప్పుడు ల్యాండ్ లైన్ వాడిన ప్రజలు ప్రస్తుతం 5జీ సాంకేతికత వినియోగానికి మైగ్రేట్ అవుతున్నారు. ఈక్రమంలో త్వరలోనే కేంద్ర టెలికాం విభాగం 5G స్పెక్ట్రమ్ కోసం వేలం నిర్వహించడానికి సిద్ధంగా ఉంది.
ప్రస్తుతం దేశంలో పూర్తి స్థాయిలో 5జీ సేవలు అందుబాటులోకి రానప్పటికీ.. టెలికాం కంపెనీలు భారీగా డబ్బులు కుమ్మరిస్తూ వేగంగా సేవలను విస్తరిస్తున్నాయి. ఇంతకుముందు సారి స్పెక్ట్రమ్ వేలంలో కేంద్ర ప్రభుత్వానికి తీవ్ర నిరాశ ఎదురైంది. అయితే ఈ సారి ఇది ఎలా ఉండబోతుందోననే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ సారి కూడా వేలానికి పెద్ద టెలికాం ఆపరేటర్లు డబ్బులు కుమ్మరిస్తారా లేదా అని ప్రభుత్వం కూడా ఆందోళన చెందుతోంది. గతసారి అదానీ తన కంపెనీ అవసరాల కోసం డేటా వేలంలో పాల్గొని అందిరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.

కేంద్ర టెలికాం శాఖ ఈసారి నిర్వహించనున్న 5జీ స్పెక్ట్రమ్ వేలంలో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా మాత్రమే మూడు ప్రైవేట్ టెలికాం కంపెనీలు పాల్గొంటున్నాయి. ఈ 5జీ స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనేందుకు చివరి రోజు వరకు కేవలం మూడు ప్రైవేట్ టెలికాం కంపెనీలు మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. జూన్ 6న ప్రారంభం కానున్న వేలంలో రూ.96,317.65 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను విక్రయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే క్రమంలో ప్రభుత్వ రంగ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ BSNL ఈసారి వేలానికి దూరంగా ఉండాలని నిర్ణయించింది.
5జీ స్పెక్ట్రమ్ వేలం మే 20న జరగాల్సి ఉండగా.. సార్వత్రిక ఎన్నికల కారణంగా ఇప్పుడు జూన్ 6కి వాయిదా పడింది. 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz, 2500 MHz, 3300 MHz, 26 GHz బ్యాండ్‌లలోని స్పెక్ట్రమ్ ఈ వేలంలో అమ్మకానికి ఉంది. ఈసారి వేలం మునుపటి వేలం వలె పోటీగా ఉండే అవకాశం లేదని పరిశ్రమ నిపుణులు అంటున్నారు. ఎందుకంటే భారతదేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీలు ప్రస్తుత డిమాండ్‌కు సరిపడా 5G స్పెక్ట్రమ్‌ను రిజర్వ్ చేశాయి.

భారత టెలికాం బిలియనీర్ సునీల్ మిట్టల్ నేతృత్వంలోని ఎయిర్‌టెల్ జమ్మూ కాశ్మీర్, ఒడిశా, బీహార్, ఉత్తరప్రదేశ్ (తూర్పు), పశ్చిమ బెంగాల్, అసోంలలో తన స్పెక్ట్రమ్‌ను పునరుద్ధరించాల్సి ఉంది. ఎయిర్ టెల్ రూ.4,200 కోట్లు, వొడఫోన్ ఐడియా రూ.1,950 కోట్లు విలువైన స్పెక్ట్రమ్ పునరుద్ధరించాల్సి ఉందని జెఫరీస్ అంచనా వేస్తోంది. అయితే రిలయన్స్ జియో ఈ సంవత్సరం స్పెక్ట్రమ్‌ను పునరుద్ధరించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అంబానీ హడావిడిగా స్పెక్ట్రమ్ కొనాల్సిన అవసరం రిలయన్స్ జియోకు లేదని తెలుస్తోంది.
ఇదే విధమైన 4G వేలంలో ఇన్ఫోటెల్ బ్రాడ్‌బ్యాండ్ అనే చిన్న కంపెనీ, భారతదేశంలోని 22 టెలికాం సర్కిల్‌లలో స్పెక్ట్రమ్‌ను గెలుచుకుంది. ఇది గంటల వ్యవధిలో రిలయన్స్‌కు విక్రయించబడింది. అలాగే వేలంలో డేటా సేవలకు మాత్రమే 4జీ స్పెక్ట్రమ్‌ను ప్రకటించగా, వాయిస్ సేవలకు కూడా వినియోగించుకునేలా కేంద్ర ప్రభుత్వం నిబంధనలను మార్చింది. దీని తర్వాత 2016లో రిలయన్స్ జియో ఎంట్రీ టెలికాం పరిశ్రమను తలకిందులు చేసింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications