వినాయక చవితి సందర్భంగా రిలయన్స్ ట్రెండ్స్ అదిరిపోయే ఆఫర్
వినాయక చవితి సందర్భంగా రిలయన్స్ రిటైల్‌కు చెందిన రిలయన్స్ ట్రెండ్స్ అద్భుతమైన ఆఫర్‌తో ముందుకు వచ్చింది. 'ట్రెండ్స్' తన కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలలో 'ట్రెండ్స్ సెల్ఫీ విత్ గణేష్' పోటీని ప్రకటించింది. గణేషుడి విగ్రహంతో ట్రెండ్స్ సెల్ఫీ అనే ఈ ఆసక్తికరమైన పోటీ వినాయక చవితి (గణేష్ చతుర్థి) పండుగ రోజున ప్రారంభమై సెప్టెంబర్ 21వ తేదీ వరకు ఉంటుంది. ఇది ప్రధానంగా ట్రెండ్స్ తన కస్టమర్ల నుండి ఎంట్రీలు ఆహ్వానించే పోటీ ఇది.
కస్టమర్లు తమ ఇళ్లల్లో గణేషుడి విగ్రహం వద్ద అలంకరణతో పాటు తాము తీసుకున్న ఫోటో లేదా సెల్ఫీని ఈ పోటీకి ఎంట్రీ గా పంపించవచ్చు. 'ఉత్తమమైన గణేష్ విగ్రహం అలంకరణ'గా నిర్ణయించబడిన సెల్ఫీ కిరూ. 1500 విలువ చేసే బహుమతి లభిస్తుంది. అంతేకాదు, ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ట్రెండ్స్ నుండి డిస్కౌంట్ కూపన్ కూడా లభిస్తుంది. దీనిని మీరు దగ్గరలో ఉన్న ట్రెండ్స్ స్టోర్ నుంచి పొందవచ్చు.

ఈ పోటీ గురించి ప్రకటన ఇందులో పాల్గొనే పద్ధతి, ఇతర వివరాలను కస్టమర్లు వారి సమీపంలోని ట్రెండ్స్ స్టోర్ నుండి తెలుసుకోవచ్చు. పోటీలో విజేతలు ఆయా పట్టణాలకు చెందిన సుప్రసిద్ధ ఆర్ట్ టీచర్స్ ద్వారా ఎంపిక చేయబడతారు. కనుక, ఈ గణేష్ చతుర్థికి మీ అన్ని ఫాషన్ అవసరాలకు మీ సమీపంలోని ట్రెండ్స్ స్టోర్‌కు వెళ్లి షాపింగ్ చేయండి. అలాగే గణేషుడి విగ్రహంతో సెల్ఫీ పోటీలో పాల్గొనడం మిస్ కావొద్దు.


Click it and Unblock the Notifications