Mukesh Ambani: మెట్రో అస్త్రం వదిలిన అంబానీ.. పోటీ సంస్థల ఉక్కిరిబిక్కిరి..
Metro Stores: అందరి అంచనాల కంటే ఒక్క అడుగు ముందుండే వాడే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ. వ్యాపారం విషయంలో ఆయన ముందుచూపు చాలా పెద్దదని చెప్పుకోవాలి. ఈసారి మరో కొత్త ఆలోచనతో రిటైల్ బిజినెస్ ముందుకు తీసుకెళ్లాలని కూతురు ఇషా ఇచ్చిన సలహాను పాటిస్తున్నారు.
గత ఏడాది డిసెంబరులో జర్మన్ క్యాష్ అండ్ క్యారీ సంస్థ మెట్లో హోల్ సేల్ భారత వ్యాపారాన్ని అంబానికి చెందిన రిలయన్స్ రిటైల్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ఏకంగా రూ.2,850 కోట్లను అంబానీ వెచ్చించారు. వాస్తవానికి గతంలో ఇది బిజినెస్ టూ బిజినెస్ ప్రాతిపధికన స్టోర్లను నిర్వహించింది. అయితే దీనికి భిన్నంగా రిటైల్ కస్టమర్లకు సైతం ఈ స్టోర్లలో కొనుగోలుకు అనుమతిస్తూ రిలయన్స్ తలుపులు తెరిచింది.

మెట్లో స్టోర్లు ప్రస్తుతం భారత కంపెనీ కిందకు రావటంతో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించిన షరతులు దేశీయ కంపెనీకి వర్తించవని తెలుస్తోంది. అందువల్ల గతంలో విదేశీ సంస్థ ఆధీనంలో కేవలం B2B వ్యాపారానికి పరిమితమైన మెట్లో స్టోర్లు ఇకపై ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఇదే సమయంలో స్టోర్లు హోల్ సేల్ వ్యాపారంలో చిన్న కిరాణా దుకాణాలు, ఎలక్ట్రానిక్స్, దుస్తుల రంగంలో తన గత వ్యాపారాన్ని కొనసాగిస్తుందని తెలుస్తోంది.
హోల్‌సేల్ ప్యాక్‌లను విక్రయించడమే కాకుండా అధిక పరిమాణంలో విక్రయించిన, బల్క్ ప్యాక్‌లకు కంపెనీ మరిన్ని డిస్కౌంట్లను అందిస్తుందని ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు. రిటైల్ వ్యాపార విస్తరణను చాలా వేగంగా కొనసాగిస్తున్న రిలయన్స్ గ్రూప్ ఒప్పందంలో భాగంగా కొంత కాలం పాటు స్టోర్లను మెట్రో పేరుతోనే కొనసాగించనుందని సమాచారం. గత ఏడాది జరిగిన కొనుగోలు డీల్ ద్వారా రిలయన్స్ దేశంలోని 21 నగరాల్లో ఉన్న 31 పెద్ద ఫార్మాట్ స్టోర్‌లను, రియల్ ఎస్టేట్ ఆస్తులను పొందింది. దీంతో ఇకపై మెట్రో కిరాణా కొత్త వాణిజ్య వ్యాపారంపై దృష్టి పెడుతుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications