Reliance: దేశంలో అత్యంత విలువైన కంపనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనసాగుతోంది. ఈ గ్రూపు కంపెనీల్లో ఆయిల్ రిఫైనరీ యూనిట్లు కూడా ఓ భాగంగా ఉన్నాయి. రష్యా చమురు వల్ల భారీగా లాభపడుతున్న ఈ విభాగాన్ని మూసివేస్తున్నట్లు వచ్చిన వార్తలు కలకలం రేపాయి.
తనిఖీ మరియు నిర్వహణ కార్యకలాపాల కోసం ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ కు అనుగుణంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కంపెనీ క్లారిటీ ఇవ్వడంతో ఇన్వెస్టర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఇందులో భాగంగా జామ్ నగర్ ప్లాంట్ లోని 3 యూనిట్లను తాత్కాలికంగా మూసివేయనున్నట్లు వెల్లడించింది.

ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనింగ్ కాంప్లెక్స్ గా జామ్ నగర్ యూనిట్ ప్రఖ్యాతి గాంచింది. దీనిలో రోజుకు 1.4 మిలియన్ బ్యారెల్స్ రిఫైనింగ్ సామర్థ్యంతో కూడిన 2 ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో క్రూడ్ డిస్టిలేషన్ యూనిట్ ను ప్రస్తుతం నిలిపివేస్తున్నట్లు ఎక్స్ఛేంజ్ లకు కంపెనీ తెలిపింది. సుమారు 7 వారాల పాటు మెయింటెనెన్స్ పనులు కొనసాగుతాయని స్పష్టం చేసింది.
మూసివేయనున్న 3 యూనిట్లు మినహా ఇతర విభాగాలు ఎప్పటిలాగే పనిచేస్తాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. ఈ చర్యల వల్ల జామ్ నగర్ కాంప్లెక్స్ మొత్తం కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం ఉండదని చెప్పింది. అయితే వీటి మూసివేత వల్ల కంపెనీ ముడి దిగుమతులు తగ్గి, గ్యాసోలిన్ మార్జిన్‌లు పెరుగుతాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications