Reliance: జియో 5జీ కోసం విదేశీ బ్యాంకుల నుంచి రుణం తీసుకోనున్న రిలయన్స్..
ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రుణాల కోసం విదేశీ బ్యాంకులను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రుణాలను జియో Jio 5G నెట్‌వర్క్ కోసం ఉపయోగించనుంది. రిలయన్స్ జియో ఈ ఏడాది ప్రారంభంలో 5G నెట్‌వర్క్‌లో బ్రాడ్‌బ్యాండ్ సేవలను ప్రారంభించింది. భారతీయ బిలియనీర్ ముఖేష్ అంబానీకి చెందిన టెలికాం కంపెనీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ రుణాలు తీసుకోవడానికి ప్రపంచ బ్యాంకులను సంప్రదించిందని ఈటీ కథనంలో పేర్కొంది.
కంపెనీ సుమారు $1-1.5 బిలియన్ల రుణాన్ని సమీకరించనుంది. ఈ లోన్ 5G నెట్‌వర్క్ గేర్‌ను కొనుగోలు చేయడం కోసం ఉపయోగించనుంది. JP మోర్గాన్ చేజ్, సిటీ, HSBC వంటి గ్లోబల్ లెండర్లు Jio కోసం దాదాపు 3-5 సంవత్సరాల కాలవ్యవధితో రుణాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి.

అంబానీ జియో గత అక్టోబర్ నుంచి తన 5G కవరేజీని వేగంగా విస్తరిస్తోంది. టెలికాం ఆపరేటర్ ఇప్పటికే దేశంలోని 5,700 నగరాలు, పట్టణాలలో 5G సేవలను ప్రారంభించింది. రాబోయే కాలంలో Jio $25 బిలియన్లు 5G కోసం పెట్టుబడిని చేస్తానని పేర్కొంది. ఇందులో $11 బిలియన్ల 5G స్పెక్ట్రమ్ కొనుగోలు ఖర్చు ఉంటుంది. భారతదేశం 5G స్పెక్ట్రమ్ వేలంలో 700 MHz స్పెక్ట్రమ్ కోసం దరఖాస్తు చేసిన ఏకైక భారతీయ టెలికాం ఆపరేటర్ Jio మాత్రమే.
జియో తన 5G కోసం యూరోపియన్ నెట్‌వర్క్ అమ్మకందారులైన ఎరిక్సన్, నోకియాతో కలిసి పనిచేస్తోంది. టెలికాం ఆపరేటర్ నోకియా నుంచి పరికరాలను కొనుగోలు చేయడానికి $1.6 బిలియన్లను సమీకరించడానికి సుముఖత వ్యక్తం చేసింది. భారతదేశంలో 5G రోల్‌అవుట్ కోసం Jioకి పరికరాలను సరఫరా చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు నోకియా గత అక్టోబర్‌లో ప్రకటించింది.


Click it and Unblock the Notifications