24seven News: భారతదేశంలో రిటైల్ స్టోర్ల విక్రయ వ్యాపారంలోకి అనేక కంపెనీలు ప్రవేశిస్తున్నాయి. అయితే ఈ రంగంలో ప్రధాన పోటీ మాత్రం కొందరు పెద్ద ఆటగాళ్ల మధ్యనే కొనసాగుతోందని మరోసారి రుజువైంది. కొత్త వ్యాపార అవకాశాలను వీరు అస్సలు మిస్ కావటం లేదు.
అవును గాడ్‌ఫ్రే ఫిలిప్స్ సంస్థ దాని రిటైల్ కిరాణా చైన్ 24సెవెన్ వ్యాపారాన్ని విక్రయించాలని చూస్తోంది. దీనిని కొనుగోలు వ్యవహారంలో ప్రధానంగా టాటా గ్రూప్ కంపెనీ టాటా ట్రెంట్, ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్, రాధాకిషన్ దమానీ అవెన్యూ సూపర్‌మార్ట్స్‌తో చర్చలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 12న స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియా తన రిటైల్ వ్యాపార విభాగాన్ని సమీక్షించిన తర్వాత నష్టాన్ని కలిగిస్తున్న 24 సెవెన్ వ్యాపారాన్ని విక్రయించే ప్రణాళికలను ప్రకటించింది.

2005లో ప్రారంభించబడిన కంపెనీకి దిల్లీ-NCR, పంజాబ్, హైదరాబాద్‌లలో 145 స్టోర్లు ఉన్నాయి. ఇది మోదీ గ్రూప్ కలర్‌బార్ బ్యూటీ బ్రాండ్ నుంచి కిరాణా, స్టేపుల్స్, స్నాక్స్, పానీయాలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులను అందిస్తుంది. కంపెనీ కొన్ని పెద్ద ఔట్‌లెట్లలో రెడీ-టు-ఈట్ ఫుడ్స్‌ను కూడా విక్రయిస్తోంది. కంపెనీ వ్యాపారం ప్రస్తుతం నష్టాల్లో ఉన్నప్పటికీ 24 సెవెన్ మోడల్‌ను కిరాణా, స్టేపుల్స్, సాధారణ సరుకులు, చిన్న ఇన్-స్టోర్ కేఫ్‌లను చేర్చడానికి విస్తరించవచ్చని తెలుస్తోంది.
టాటా గ్రూప్ రిటైల్ కంపెనీ ట్రెంట్ లిమిటెడ్ కిరాణా చైన్ 'స్టార్ బజార్'ను నిర్వహిస్తుంది. ఒకవేళ కొనుగోలు ఒప్పందం జరిగితే 24 సెవన్ దాని విస్తరణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని తెలుస్తోంది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ గురించి పరిశీలిస్తే.. టెక్సాస్ కంపెనీ 7-ఎలెవెన్ బ్రాండ్‌తో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. 2021లో ప్రారంభించబడిన ఈ సంస్థ దేశవ్యాప్తంగా 50 స్టోర్లను నిర్వహిస్తోంది. రిలయన్స్ 24 సెవెన్ కొనుగోలు జరిగితే సౌకర్యవంతమైన స్టోర్ చైన్‌ను దానిలో విలీనం చేయవచ్చు. వ్యాపారవేత్త రాధాకిషన్ దమానీకి చెందిన డిమార్ట్‌ను నడుపుతున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్ కంపెనీ కూడా 24సెవెన్‌పై దృష్టి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రధాన ఆటగాళ్ల సమూహం తమ విస్తరణకు 24 సెవెన్ స్టోర్లను వినియోగించుకోవచ్చని తెలుస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications