ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇటీవల పలు కంపెనీలను అక్వైర్ చేసుకుంటోంది. తాజాగా జస్ట్‌డయల్‌ను సొంతం చేసుకోవడానికి చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. 800 నుండి 900 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడానికి జస్ట్‌డయల్‌తో చర్చలు జరుపుతోంది. మన కరెన్సీలో రూ.6,600 కోట్ల వరకు ఈ డీల్ ఉండవచ్చు. ఈ డీల్ పూర్తయితే రిలయన్స్‌లోకి మరో కీలక సంస్థ వచ్చి చేరినట్లు అవుతుంది. ఇందుకు సంబంధించి జూలై 16న అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
జూలై 16న ఇందుకు సంబంధించి రిలయన్స్ బోర్డ్ సమావేశం ఉండనుందని తెలుస్తోంది. స్థానిక సెర్చ్ ఇంజిన్ సెగ్మెంట్‌లో జస్ట్‌డయల్ మార్కెట్ లీడర్‌గా వెలుగొందుతోంది. సగటున 150 మిలియన్ల క్వార్టర్లీ యూనిక్ విజిటర్లను కలిగి ఉంది. ఈ కంపెనీ మొబైల్, యాప్స్, వెబ్ సైట్, టెలిఫోన్ హాట్ లైన్ నెంబర్ 8888888888 తదితర ప్లాట్‌ఫాంలలో పనిచేస్తోంది.

జస్ట్ డయల్ మేనేజింగ్ డైరెక్టర్ వీఎస్ఎస్ మణి, వీరి కుటుంబానికి ఈ సంసథలో 35.5 శాతం వాటా ఉంది. ఈ కంపెనీ వ్యాల్యూ ప్రస్తుతం రూ.2,387.9 కోట్లుగా ఉంది. జస్ట్ డయల్‌ను మణి నుండి కొనుగోలు చేయడానికి రిలయన్స్ ఆసక్తి చూపిస్తోంది. అలాగే ఆ తర్వాత ఓపెన్ ఆఫర్ ద్వారా మరో 26 శాతం వాటాను దక్కించుకోనుంది. అదే జరిగితే రిలయన్స్ వాటా 60 శాతానికి చేరుకుంటుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications