కరోనా వైరస్ కట్టడి పాత్రలో సాయం కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకు వచ్చింది. ఈ మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు వివిధ రకాలుగా సాయం చేస్తోంది. ఫేస్‌మాస్క్‌లు ఉత్పత్తి, రిలయన్స్ తరఫున ఉచితంగా ఇంధనం, భోజనం, కరోనా రోగుల కోసం 100 బెడ్స్ హాస్పిటల్ ఇలా వివిధ రూపాల్లో సాయానికి ముందుకు వచ్చింది. రిలయన్స్ పనులు ఆగిపోతే తాత్కాలిక, ఒప్పంద ఉద్యోగుల వేతనాలు చెల్లిస్తామని కూడా భారీ ఊరట కల్పించింది.

మాస్కుల ఉత్పత్తి
ఇండియాలో రోజురోజుకు విజృంభిస్తున్న కరోనాను అరికట్టేందుకు తనవంతుగా చేయూతను అందించడంలో భాగంగా మాస్క్‌ల ఉత్పత్తి సామర్థ్యాన్ని రోజుకు లక్షకు పెంచుతామని రిలయన్స్ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం రిలయన్స్ ప్రకటి చేసింది.

ఉచిత ఇంధనం, ఉచిత భోజనం
కరోనా వైరస్ పేషెంట్ల కోసం ఉపయోగించే వాహనాలకు ఉచిత ఇంధనం సరఫరా చేస్తామని తెలిపింది. దేశంలోని వివిధ నగరాల్లో జీవనాధారం కోల్పోయిన వారికి ఉచితంగా భోజనం అందిస్తామని ప్రకటించింది. ఇందుకు ఆయా నగరాల్లోని ఎన్జీవోలతో కలిసి పని చేస్తామని తెలిపింది. లాక్ డౌన్ కారణంగా చాలామంది జీవనాధారం కోల్పోతారని, కాబట్టి వారికి ఉచితంగా ఆహారం పంపిణీ చేస్తామని తెలిపింది.

100 పడకల ఆసుపత్రి
కార్పోరేట్ సామాజిక బాధ్యతా విభాగానికి చెందిన ముంబై ఆసుపత్రిలో 100 పడకల ఆసుపత్రిని సిద్ధం చేశామని రిలయన్స్ తెలిపింది. కరోనా పాజిటివ్ సోకిన వారికి చికిత్స అందించడానికి రెండు వారాల్లోనే ఈ ఆసుపత్రిని బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(BMC)తో కలిసి సర్ హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ నెలకొల్పింది.

బెడ్స్ వద్దే మెడికల్ కిట్
అన్ని రకాల పడకల వద్ద బయోమెడికల్ పరికరాలు, వెంటిలెటర్స్, పేస్ మేకర్లు, డయాల్‌సిస్ మెషిన్లు, పేషెంట్ మానిటరింగ్ పరికరాలు ఏర్పాటు చేసింది. ఇండియాలో ఇది ఫస్ట్ కోవిడ్-19 హాస్పిటల్. ట్రీట్మెంట్ కోసం లేదా ఐజోలేషన్ కోసం ఇందులో చికిత్స అందించవచ్చు. మెడికల్ కిట్ వెంటనే అందుబాటులో ఉంటుంది.

కరోనా మందు కోసం రిలయన్స్ ప్రయత్నం
రిలయన్స్ లైఫ్ ఇన్సురెన్స్‌కు చెందిన వైద్యులు, రీసెర్చర్లు కరోనా మహమ్మారి వైరస్‌కు మెడిసిన్‌ను కనుగొనే ప్రయత్నాల్లో ఉన్నారని కూడా తెలిపింది. తమ డాక్టర్లు, రీసెర్చర్లు ఇందుకోసం అహర్నిషలు కృషి చేస్తున్నారని పేర్కొంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications