వ్యవసాయ వ్యాపారంలోకి ప్రవేశించే ప్రణాళికల్లేవు: రిలయన్స్

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాల నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ పైన వస్తున్న ఆరోపణలను ఆ సంస్థ తోసిపుచ్చింది. వ్యవసాయ చట్టాలతో రిలయన్స్ సంస్థకు లబ్ధి చేకూరుతుందనే ప్రచారంలో వాస్తవం లేదని సోమవారం స్పష్టం చేసింది. తమకు కాంట్రాక్ట్ లేదా కార్పోరేట్ వ్యవసాయ వ్యాపారంలోకి ప్రవేశించే ప్రణాళిక లేదని చెప్పింది. ఇందుకు సంబంధించి తాము ఎలాంటి భూమిని కొనుగోలు చేయలేదని, భవిష్యత్తులోను అలాంటి ఆలోచన లేదని తెలిపింది.

అహర్నిషలు కష్టపడి రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర లభించే అంశాలకు రిలయన్స్, అనుబంధ సంస్థలు మద్దతిస్తాయని, రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలని తమ సరఫరాదారులకు కూడా కోరామని తెలిపింది. తాము నేరుగా రైతుల నుండి ఆహారధాన్యాలు కొనుగోలు చేయడం లేదని, తమ మద్దతుదారులు కూడా కనీస మద్దతు ధరకు ధాన్యం సేకరిస్తారని వెల్లడించింది.

Reliance says it has nothing to do with farm laws

తక్కువ ధరకే సేకరించాలనే అంశానికి సంబంధించి ఎలాంటి దీర్ఘకాలిక ఒప్పందాలు లేవని తేల్చి చెప్పింది. 130 కోట్ల మందికి తిండి పెడుతున్న అన్నదాత పట్ల తమకు గౌరవం ఉందని తెలిపింది. మరోవైపు, జియో టవర్ల ధ్వంసంపై రిలయన్స్ పంజాబ్, హర్యాన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీని వెనుక తమ ప్రత్యర్థుల ప్రమేయం ఉండవచ్చునని ఆరోపించింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+