Reliance News: చమురు వ్యాపారంలో దిగ్గజంగా కొనసాగుతున్న దేశీయ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ భవిష్యత్ ఇంధన అవసరాలపై ఫోకస్ పెట్టింది. మారుతున్న అవసరాలకు అనుగుణంగా సరికొత్త వ్యాపార ఆలోచనను తెరమీదకు తీసుకొచ్చింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ బుధవారం తొలిసారిగా ఎలక్ట్రిక్ వాహనాల(EV) కోసం మార్చుకోదగిన(swappable) బ్యాటరీలను ప్రదర్శించింది. దీనికి తోడు ఇవి మల్టీపర్పస్ బ్యాటరీ స్టోరేజ్ టెక్నాలజీని కలిగి ఉంటాయని, ఎలక్ట్రిక్ వాహనాల కోసం తన క్లీన్ ఎనర్జీ లక్ష్యాల్లో భాగంగా వీటిని తెచ్చినట్లు వెల్లడించింది. అదేవిధంగా ఇళ్లలో వినియోగించే ఇన్వెర్టర్లకు సైతం తొలిసారిగా మార్చుకోదగిన బ్యాటరీ సాంకేతికతను ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఈ నూతన సాంకేతికత ద్వారా ఎవరైనా వ్యక్తి సదరు బ్యాటరీని తమ ఎలక్ట్రిక్ వాహనాలను నడుపుకునేందుకు వినియోగించుకోవచ్చు. అలాగే అదే బ్యాటరీని ఇంట్లో వస్తువుల కోసం ఇన్వర్టర్‌గా కూడా వాడుకోవచ్చు. ఈ సరికొత్త బ్యాటరీలను వినియోగదారులు రిలయన్స్ బ్యాటరీ స్వాప్ స్టేషన్‌లలో మార్చుకోవచ్చు లేదా రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్‌లను ఉపయోగించి ఇంటివద్దనే రీ-ఛార్జ్ చేసుకోవచ్చు. అయితే ఈ బ్యాటరీలు ఎప్పుడు వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయనే విషయాన్ని కంపెనీ ఇంకా ప్రకటించలేదు.
బ్యాటరీ స్టోరేజ్ సొల్యూషన్స్ అభివృద్ధి అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్ చేపట్టిన 10 బిలియన్ డాలర్ల క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం చేస్తున్న గ్రీన్ పుష్‌లో ఒక భాగం. కంపెనీ తన ప్రధాన ఆయిల్ అండ్ కెమికల్స్ వ్యాపారంపై ఆధారపడటాన్ని తగ్గించే క్రమంలో రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు, ఆవిష్కరణలను భారీగా పెంచుతోంది. ఈ క్రమంలో 2021-22లో UK ఆధారిత సోడియం-అయాన్ బ్యాటరీలను తయారు చేసే ఫారాడియన్, లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీలను ఉత్పత్తి చేసే లిథియం వర్క్స్ కంపెనీలను 200 మిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications