Reliance News: హెలికాఫ్టర్ షాక్ కొట్టేందుకు అంబానీ ప్లాన్.. జియో మార్ట్ హోరుకు మెగా ప్లాన్..
Reliance News: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఏం చేసినా దాని వెనకాల పక్కా లెక్కలు ఉంటాయి. ఆయన ఎక్కుపెడితే గురితప్పకుండా తగలాల్సిన వారికి, తగలాల్సిన చోట తగులుతాయి.
తన ఈ-కామర్స్ వ్యాపారాన్ని దేశంలోని ప్రజలకు చేరువ చేసేందుకు మిస్టర్ కెప్టెన్ కూల్, మాజీ టీమ్ ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని రంగంలోకి దించారు. తన ఫ్లాగ్ షిప్ జియో మార్ట్ బ్రాండ్ అంబాసిడర్‌గా MSDని ఎంచుకున్నారు. దేశంలో పండుగల సీజన్ మెుదలవుతున్న వేళ ప్రత్యర్థులు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా, మీషో వంటి కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు ధోనీని ప్రచారకర్తగా ఎంచుకుని ఇషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ మెగా ప్లాన్ వేసింది.

అక్టోబర్ 8 నుంచి JioMart ధోనితో కొత్త ప్రకటనల ప్రచారాన్ని ప్రారంభించనుంది. ధోని బ్రాండ్ అంబాసిడర్‌గా అతని వ్యక్తిత్వం నమ్మకం, విశ్వసనీయత, హామీకి ప్రాతినిధ్యం వహిస్తుందని తాము గుర్తించనట్లు జియోమార్ట్ సీఈవో సందీప్ వరగంటి తెలిపారు. కంపెనీ మెుత్తం అమ్మకాల్లో 60 శాతం వాటా నాన్-మెట్లో నగరాల నుంచే ఉన్నట్లు వెల్లడించింది. 2020లో రిలయన్స్ రిటైల్ ఆన్ లైన్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌గా ప్రారంభమైన జియోమార్ట్ క్వార్టర్-ఆన్-క్వార్టర్ ప్రాతిపదికన తన విక్రేత బేస్‌ను 56 శాతం విస్తరించిందని కంపెనీ తన క్యూ4 ఫలితాల్లో వెల్లడించింది.
రిలయన్స్ కంపెనీకి బ్లాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించటంపై ధోనీ స్పందిస్తూ.. స్వదేశీ ఈ-కామర్స్ బ్రాండ్ అయిన జియోమార్ట్ డిజిటల్ రిటైల్ విప్లవానికి మద్దతు ఇవ్వాలనే ఉద్ధేశ్యంతో దీనికి అంగీకరించినట్లు తెలిపారు. శక్తివంతమైన సంస్కృతి, ప్రజలు, పండుగలకు ప్రసిద్ధి చెందిన భారతదేశంలో రిలయన్స్ గ్రూప్ జియో ఉత్సవ్(JioUtsav) పేరుతో తన పండుగల మెగా సేల్ ప్రచారాన్ని ధోని ప్రచారకర్తగా మెుదలుపెడుతోంది. ఇందులో ఎలక్ట్రానిక్స్ నుంచి ఫ్యాషన్, బ్యూటీ, గృహాలంకరణాలను అందుబాటులో ఉంచింది. దీనికి తోడు జియోమార్ట్ అర్బన్ లాడర్, రిలయన్స్ ట్రెండ్స్, రిలయన్స్ జ్యువెల్స్, హామ్లీస్ వంటి రిలయన్స్ యాజమాన్యంలోని బ్రాండ్‌లను ఆన్‌బోర్డ్ చేసింది.


Click it and Unblock the Notifications