Reliance: తండ్రి వ్యాపారాలను వెనక్కి నెట్టిన ఇషా అంబానీ.. ఆశ్చర్యంలో ముఖేష్ అంబానీ..
Mukesh Ambani: తండ్రికి తగ్గ తనయగా ఇషా అంబానీ సంచలనాలు సృష్టిస్తోంది. పగ్గాలు చేపట్టిన తక్కువ కాలంలోనే రిలయన్స్ రిటైల్ వ్యాపారాన్ని శరవేగంగా ముందుకు తీసుకెళుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
దిగ్గజ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ తన వారసులకు కంపెనీల బాధ్యతలను అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముఖేష్ అంబానీ, ఇషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ విలువను రూ.9,26,055 కోట్లుగా బ్రోకరేజ్ సంస్థ బెర్న్‌స్టెయిన్ అంచనా వేసింది. ఇషా అంబానీ నడిపిస్తున్న రిలయన్స్ రిటైల్ విలువ రిలయన్స్ ఆయిల్ టు కెమికల్స్ వ్యాపారం(రూ.4,71,295 కోట్లు) కంటే విలువైనదని బెర్న్‌స్టెయిన్ నివేదిక వెల్లడించింది.

రిలయన్స్ రిటైల్‌లో కొత్త భాగస్వామ్యాలు, విస్తరణ విషయంలో అంబానీలు దూకుడుగా ముందుకు సాగుతున్నారు. కొన్ని నెలలుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ రిటైల్ విభాగం ఆఫ్‌లైన్ స్టోర్లు, జియోమార్ట్, కొత్త కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లపై భారీగా పెట్టుబడి పెట్టింది. రిలయన్స్ EBITDA భారీగా పెరుగుదలకు డిజిటల్ రిటైల్, న్యూ ఎనర్జీ వల్ల జరిగినట్లు బ్రోకరేజ్ వెల్లడించింది. FY27 నాటికి రిలయన్స్ రిటైల్ వ్యయం రూ.18,900 కోట్లకు చేరుకుంటుందని.. ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ మొత్తం మూలధన వ్యయంలో 19% వాటాను కలిగి ఉంటుందని కూడా అంచనా వేసింది.
రిలయన్స్ రిటైల్‌తో పాటు, కంపెనీ ఈ-కామర్స్ సెగ్మెంట్ అయిన జియోమార్ట్ ప్లాట్‌ఫారమ్‌లను 77 బిలియన్ డాలర్లు, వర్ధమాన పునరుత్పాదక ఇంధన వ్యాపారం 17 బిలియన్ డాలర్లుగా బ్రోకరేజ్ విలువ కట్టింది. ఆగస్ట్ 2022లో రిలయన్స్ రిటైల్ కొత్త లీడర్‌గా వారసురాలు ఇషా అంబానీని ముఖేష్ అంబానీ నియమించారు. ఆ సమయంలో ఫ్రిమ్ రూ. 2 లక్షల కోట్ల టర్నోవర్‌ను సాధించగలిగింది. జిమ్మీ చూ, జార్జియో అర్మానీ, హ్యూగో బాస్, వెర్సేస్, మైఖేల్ కోర్స్, బ్రూక్స్ బ్రదర్స్, అర్మానీ ఎక్స్ఛేంజ్, బుర్బెర్రీ అనేక ఇతర ప్రపంచ బ్రాండ్లు రిలయన్స్ రిటైల్ భాగస్వామి బ్రాండ్‌గా దేశంలో అందుబాటులోకి వచ్చాయి.


Click it and Unblock the Notifications