Isha Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ రిటైల్ మార్కెట్‌పై ఎక్కువ దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా దీని బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కంపెనీ వేగం గతంలో ఎన్నడూ చూడని విధంగా పెరిగింది. ఈ సారి కంపెనీ మార్కెట్లో మరింత చొచ్చుకుపోయేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.

సొంత బ్రాండ్లు..
కంపెనీ తన ఉత్పత్తులను ఇండిపెండెన్స్ ఫర్ సేల్ అనే కొత్త బ్రాండ్ పేరుతో ఎఫ్ఎమ్సీజీ రంగంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించింది. దీనికి ముందు కంపెనీ గడచిన ఏడాదిగా ఆహారం, స్నాక్స్, శీతల పానీయాలు, ఇతర రోజువారీ గృహ వినియోగ ఉత్పత్తుల్లో అనేక కంపెనీలను ఇప్పటికే కొనుగోలు చేసింది. పూర్తి స్థాయి FMCG కంపెనీ కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించిన కంపెనీ ఇక రంగంలోకి దిగింది.

ధరల యుద్ధానికి తెర..
దేశంలోని అతిపెద్ద FMCG మార్కెట్ ఆదాయంపై కన్నేసిన అంబానీలు రిలయన్స్ జియో మాదిరిగానే పెనిట్రేటింగ్ స్థాటజీని వినియోగించవచ్చని తెలుస్తోంది. ఇదే జరిగితే ఆ రంగంలోని కంపెనీలతో 365 రోజులూ ధరల యుద్ధం ఉంటుందని వ్యాపారాలు అంటున్నారు. అలా ప్రజలను ఆకర్షించి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు.

తొలి యుద్ధక్షేత్రం గుజరాత్..
INDEPENDENCE బ్రాండ్ క్రింద సరసమైన ధరలకు నూనెలు, పప్పులు, తృణధాన్యాలు, ప్యాక్ చేసిన ఆహారాలతో పాటు ఇతర ఉత్పత్తులు ఉంటాయని ఇషా అంబానీ వెల్లడించారు. అయితే తొలి దశలో రిలయన్స్ రిటైల్ ఈ ఉత్పత్తులను ముఖేష్ అంబానీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో బ్రాండ్‌ను ప్రారంభించాలని యోచిస్తోంది. ఆ తర్వాత దీనిని దేశవ్యాప్తంగా విస్తరించాలని కంపెనీ చూస్తోంది.

కంపెనీల్లో గుబులు..
దీనికి సంబంధించిన ప్రణాళికలను ఆగస్టులో జరిగిన కంపెనీ 45వ వార్షిక సర్వసభ్య సమావేశంలో వెల్లడించింది. రిలయన్స్ తీసుకొస్తున్న బ్రాండ్ హిందుస్థాన్ యూనిలీవర్, ITC ఉత్పత్తులకు మార్కెట్లో పెద్ద పోటీదారుగా నిలవనుంది. అయితే ప్రతి భారతీయుడికీ నాణ్యమైన, సరసమైన ఉత్పత్తులను అందించాలనే లక్ష్యంతో తాము ముందుకెళ్తున్నట్లు ఇషా అంబానీ వెల్లడించారు.

లాభాల పంట..
మార్చి 31, 2022తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ మెుత్తం రూ.1.99 లక్షల కోట్ల టర్నోవర్ పై రూ.7,055 కోట్ల లాభాన్ని ఆర్జించింది. కంపెనీరిలయన్స్ ఫ్రెష్, రిలయన్స్ స్మార్ట్, రిలయన్స్ స్మార్ట్ పాయింట్, జియోమార్ట్, రిలయన్స్ డిజిటల్, జియోమార్ట్ డిజిటల్, జియో స్టోర్, రిలయన్స్ ట్రెండ్, రిలయన్స్ కన్స్యూమర్ బ్రాండ్‌లు, 7-ELEVEN, ప్రాజెక్ట్ ఈవ్, ట్రెండ్ ఫుడ్‌వేర్, రిలయన్స్ జ్యువెల్, రిలయన్స్ మాల్ తో పాటు ఇప్పుడు కొత్త INDEPENDENCE బ్రాండ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications