Mukesh Ambani: ముఖేష్ అంబానీ న్యూ ప్లాన్.. ఆందోళనలో చాలా మంది వ్యాపారులు..
Reliance News: ఒకప్పుడు పెద్ద నగరాలు, పట్టణాలకే పరిమితమైన రిలయన్స్ వ్యాపారాలను చిన్న టౌన్లకు సైతం అందుబాటులోకి తెచ్చే పనిలో అంబానీ ఫ్యామిలీ ఉంది. ఇషా అంబానీతో కలిసి తండ్రి ముఖేష్ దీనిపై భారీగానే హోమ్ వర్క్ చేసినట్లు తెలుస్తోంది.
ఇండియాతో పాటు ఆసియాలో అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్న రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాలను టార్గెట్ చేశారు. రిటైల్ వ్యాపారంలో ఇక్కడ పట్టు సాధించాలని పెద్ద ఆటకు తెరలేపుతున్నారు. అందుకే ఫ్యాషన్ వరల్డ్ పేరుతో ట్రెండ్స్ బ్యానర్ కింద 500 రిటైల్ దుస్తుల దుకాణాలను తెరిచేందుకు సిద్ధమయ్యారు. దీని ద్వారా దేశంలోని అతిపెద్ద రిటైల్ కంపెనీ మొదటిసారిగా స్టోర్ ఫార్మాట్‌లోకి ప్రవేశించబోతోంది. వీటిని ఫ్రాంచైజీ మోడల్‌లో విస్తరించాలని చూస్తోంది.

ఇకపై రిలయన్స్ వి-మార్ట్ రిటైల్ వంటి కంపెనీలతో నేరుగా పోటీ పడనుంది. కంపెనీ ప్రస్తుతం సిలిగురి, ధూలే, ఔరంగాబాద్ వంటి నగరాల్లో ఐదు ఫ్యాషన్ వరల్డ్ బై ట్రెండ్స్ స్టోర్‌లను ప్రారంభించింది. రిలయన్స్ చిన్న పట్టణాల్లో దాదాపు 2,600 ట్రెండ్స్ స్టోర్‌లను తెరిచింది. అయితే ఫ్యాషన్ వరల్డ్ బై ట్రెండ్స్ స్టోర్‌లు వాటికి పూర్తి భిన్నంగా ఉంటాయని కంపెనీ వెల్లడించింది. రిలయన్స్ ట్రెండ్స్ స్టోర్లు లేని నగరాల్లో వీటిని ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఈ దుకాణాలు 5000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటాయి.
రిలయన్స్ రిటైల్ దేశంలో అతిపెద్ద దుస్తులు రిటైలర్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇది బహుళ బ్రాండెడ్ ఉత్పత్తులతో 4,000 కంటే ఎక్కువ స్టోర్‌లను కలిగి ఉంది. ట్రెండ్స్ బ్రాండ్ దేశంలో అతిపెద్ద ఫ్యాషన్ రిటైల్ చైన్.. పైగా ఇది ప్రస్తుతం ఫ్రాంచైజీ మోడల్ లో తన కొత్త స్టోర్లను విస్తరిస్తోంది. అతి త్వరలోనే రిలయన్స్ రిటైల్ B2C కేటగిరీలో తన సొంత బ్లాండ్ల ఉత్పత్తులను విక్రయించాలని చూస్తున్న సంగతి తెలిసిందే. మెుత్తానికి ఎవరు కొన్నా, ఎక్కడ కొన్నా, ఏం కొన్నా అవి త్వరలో ఎక్కువ శాతం రిలయన్స్ ఉత్పత్తులు ఉంటాయని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications