ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్... జియో మార్ట్ ఎక్స్‌ప్రెస్‌తో క్విక్ కామర్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కేవలం గంటన్నర వ్యవధిలో సరుకులు ఇంటికి సరఫరా చేస్తామని ప్రకటించింది. జియో మార్ట్ ఎక్స్‌ప్రెస్ అనే కొత్త ప్లాట్‌ఫామ్ (యాప్) ద్వారా రిలయన్స్ రిటైల్ ఈ ఇన్‌స్టాంట్ గ్రాసరీ డెలివరీ సేవలను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం నేవీ ముంబైలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఈ ఏడాది చివరి నాటికి 200 నగరాలకు/పట్టణాలకు విస్తరించనున్నారు.
ఇప్పటికే టాటా ఆదీనంలోని బిగ్ బాస్కెట్, జొమాటో ఫండెడ్ బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్ క్విక్, జెప్టో వంటివి ఇప్పటికే క్విక్ సేవలను అందిస్తున్నాయి. ఇప్పుడు జియో మార్ట్ ఎక్స్‌ప్రెస్ వీటికి పోటీ ఇవ్వనుంది. 90 నిమిషాల్లో డెలివరీ హామీ ఇస్తోంది. కనీస ఆర్డర్ వ్యాల్యూ లేనప్పటికీ, ఉచిత డెలివరీ మాత్రం కనీసం రూ.199. రిలయన్స్ రిటైల్ స్టోర్స్ ద్వారా జియో మార్ట్ ఎక్స్‌ప్రెస్ డెలివరీలు చేస్తారు. మెడిసిన్స్, స్మార్ట్ ఫోన్ వంటి వాటిని కూడా అందించేందుకు రిలయన్స్ సిద్ధమవుతోంది.

రిలయన్స్ కొద్ది నెలల క్రితం క్యూ-కామర్స్ సంస్థ డుంజోలో 26 శాతం వాటాలను కొనుగోలు చేసింది. కొన్ని ప్రాంతాల్లో డుంజో ద్వారా ఎక్స్‌ప్రెస్ సేవలు అందించనున్నట్లు తెలుస్తోంది. సంప్రదాయ ఈ-కామర్స్ సంస్థల ద్వారా ఆర్డర్ చేసే వస్తువుల డెలివరీకి కనీసం ఒకరోజైనా సమయం పడుతుంది. కానీ ఇప్పుడు క్విక్-కామర్స్‌కు ఆదరణ పెరుగుతోంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications