Reliance Retail: భారీ అప్పుల్లో రిలయన్స్ రిటైల్.. 73 శాతం పెరిగిన రుణ భారం..
Reliance Retail: ప్రస్తుతం రిలయన్స్ రిటైల్ వ్యాపారాలను కలిగి ఉన్న రిలయన్స్ రిటైల్ వ్యాపారాన్ని ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా నిర్వహిస్తున్నారు. ఆమె రాకతో ఇటీవల అనేక కంపెనీల్లో పెట్టుబడులు, కొనుగోళ్లను చేసి వ్యాపారాన్ని విస్తరించారు.
ఈ క్రమంలో 2023 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ రిటైల్ క్యుములేటివ్ రుణాలు 73 శాతం మేర పెరిగాయి. కంపెనీ బ్యాంకుల నుంచి రూ.32,303 కోట్లను అప్పుగా తీసుకుంది. అలాగే హోల్డింగ్ కంపెనీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ నుంచి రూ.13,304 కోట్లను సేకరించింది. ఇటీవలి వార్షిక నివేదిక ప్రకారం రిలయన్స్ రిటైల్ రూ.19,243 కోట్ల దీర్ఘకాలిక రుణాలను కలిగి ఉన్నట్లు వెల్లడైంది. గత ఏడాదితో పోల్చితే అప్పు 73% అంటే రూ.70,943 కోట్లు పెరిగింది.

కంపెనీ డెట్-టు-ఈక్విటీ నిష్పత్తి FY22లో 1.35 నుంచి FY23లో 1.91కి పెరిగింది. కంపెనీ చేస్తున్న వేగవంతమైన వ్యాపార విస్తరణ కోసం ఈ నిధులను వినియోగిస్తోంది. కొత్తగా దేశవ్యాప్తంగా 3,300 కొత్త అవుట్‌లెట్‌లను ప్రారంభించింది. RRVL పెట్టుబడిదారుల నుంచి సేకరించిన నిధుల్లో కొంత భాగాన్ని రుణ చెల్లింపుల కోసం ఉపయోగిస్తోంది.
పెరిగిన రుణాలు ఉన్నప్పటికీ రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ బలమైన రాబడి వృద్ధి, ఆపరేటింగ్ పరపతి కారణంగా కంపెనీ రుణ స్థాయిలు నిర్వహించబడతాయి. కంపెనీ వ్యాల్యూయేషన్ సైతం ఇటీవల భారీగా పెరిగింది. ప్రధానంగా అపియరెల్స్ వ్యాపారంలో కంపెనీ వేగంగా కొత్త విదేశా బ్రాండ్లతో జతకడుతూ వినియోగదారులను పెంచుకుంటోంది.


Click it and Unblock the Notifications