ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి సాధిస్తోన్న రెండో రిటైల్ కంపెనీగా నిలిచింది. ఈ మేరకు డెలాయిట్ రూపొందించిన గ్లోబల్ రిటైల్ పవర్ హౌసెస్ 2021 ర్యాంకింగ్‌లో రిలయన్స్ రిటైల్ రెండో స్థానంలో ఉంది. అమెరికా దిగ్గజం వాల్‌మార్ట్ మొదటి స్థానంలో ఉంది. ఇక దిగ్గజ రిటైల్ సంస్థల్లో వాల్‌మార్ట్ మొదటి స్థానంలో ఉండగా, అమెజాన్ డాట్ కామ్ రెండో స్థానానికి చేరుకుంది. కాస్ట్‌కో హోల్‌సేల్ కార్పోరేషన్ మూడో స్థానంలో, జర్మనీ స్వ్కార్జ్ నాలుగో స్థానంలో ఉంది.

టాప్ 10లో ఏడు అమెరికా కంపెనీలు
టాప్ టెన్ స్థానాలలో 7 అమెరికాకు చెందిన సంస్థలు ఉన్నాయి. యూకే నుండి టెస్కో PLC(10వ ర్యాంకు) ఉంది. క్రోజెర్ కంపెనీ 5వ స్థానం, వాల్‌గ్రీన్స్ బూట్స్ అలియన్స్ 6వ స్థానం, సీవీఎస్ హెల్త్ కార్పొరేషన్ 9వ స్థానంలో ఉన్నాయి. ఇవన్నీ అమెరికా సంస్థలు. జర్మనీకి చెందిన అల్దీ ఇన్‌కాఫ్ జీఎంబీహెచ్ అండ్ అల్దీ ఇంటర్నేషనల్ సర్వీసెస్ జీఎంబీహెచ్ ఎనిమిదో ర్యాంకులో ఉంది.

3 స్థానాలు ఎగబాకిన రిలయన్స్ రిటైల్
అంతర్జాతీయంగా 250 రిటైలర్ల జాబితాలో భారత్ నుండి ఎంపికైన ఏకైక కంపెనీ రిలయన్స్ రిటైల్. గ్లోబల్ పవర్స్ ఆఫ్ రిటైలింగ్, వరల్డ్స్ ఫాస్టెస్ట్ రిటైలర్స్ జాబితాలో రిలయన్స్ రిటైల్ స్థానం సంపాదించడం ఇది నాలుగోసారి. ఇది కూడా వరుసగా నాలుగోసారి కావడం గమనార్హం. గ్లోబల్ పవర్స్ ఆఫ్ రిటైలింగ్ జాబితాలో గతంలో 56వ స్థానంలో ఉండగా, ఈసారి మూడు స్థానాలు ఎగిసి 53కు చేరుకుంది.

రెండేళ్ల క్రితం..
ఇదిలా ఉండగా రిలయన్స్ రిటైల్ వ్యాపార విస్తరణ జోరులో రెండేళ్ల క్రితం ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు రెండో స్థానానికి పరిమితం అయింది. 2019తో పోలిస్తే 2020లో 41.8శాతం వృద్ధి సాధించడం, స్టోర్స్ సంఖ్య 13.1 శాతం పెంచుకోవడం కలిసొచ్చినట్లు డెలాయిట్ తెలిపింది.
More From GoodReturns

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు



Click it and Unblock the Notifications