Ambani news: అదరగొట్టిన అనిల్ అంబానీ కంపెనీ.. ఆరు నెలల్లోనే మార్కెట్ వాల్యూ డబుల్
Ambani news: దేశంలో అత్యంత ధనవంతుడిగా ముఖేష్ అంబానీ కొనసాగుతున్నారు. తన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ మోస్ట్ వాల్యుబుల్ కంపెనీగా నిలుస్తోంది. అయితే ఆయన సోదరుడు అనీల్ అంబానీ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. పీకల్లోతు అప్పుల్లోకి కూరుకుపోయి, దివాళా తీశారు. కానీ ఇప్పుడు ఆయన కంపెనీ ఒకటి ఇన్వెస్టర్లకు స్వీటెస్ట్ షాక్ ఇచ్చింది.
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ విలువ భారీగా పెరిగింది. ఏకంగా దాని సంపద రెట్టింపు అయింది. గత 6 నెలలుగా కంపెనీ షేర్లు లాభపడుతున్నాయి. స్టాక్ విలువ 9.50 నుంచి 20కి పైగా పెరిగింది. దీంతో మార్కెట్ విలువ కాస్తా డబుల్ అయింది. కంపెనీ ప్రస్తుతం 50 వేల 781 కోట్ల ఆస్తులను, 8 వేల 400 కోట్లకు పైగా ఆదాయాన్ని కలిగి ఉంది.

మూడేళ్ల క్రితం కంపెనీ షేర్ విలువ రూ. 1/-తో ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయికి చేరుకుంది. గతేడాదిగా స్థిరమైన రికవరీ రేటుతో రూ.20/- గరిష్ఠ స్థాయికి పెరిగింది. సెప్టెంబర్ 30న రిలయన్స్ షేర్ ధర 20.12 ఉండగా.. మూడేళ్ల క్రితం మార్చి 2020లో రూ. 1/-గా నమోదైంది.
రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ ద్వారా రిలయన్స్ పవర్ మరియు రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ భారీ మొత్తాన్ని సమీకరించాయి. అనిల్ అంబానీకి చెందిన ఈ 2 కంపెనీలు 1,043 కోట్లను సమీకరించడం వల్ల రిలయన్స్ పవర్ షేర్ల ధరలు ఆకస్మికంగా పెరిగినట్లు విశ్లేషకుల అంచనా. వీటికితోడు రుణభారాన్ని తగ్గించుకోవడానికి టెలికమ్యూనికేషన్స్ మరియు ఆర్‌ఇన్‌ఫ్రాతో సహా కొన్ని కంపెనీలను విక్రయించేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications