Metro deal: దేశంలో అత్యంత విలువైన కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనసాగుతోంది. రిటైల్ బిజినెస్‌ను మరింత విస్తరించే ప్రణాళికల్లో భాగంగా గతేడాది మెట్రోను కొనుగోలు చేసింది. ఇందుకోసం చెల్లించిన ఓ పెద్దమొత్తంపై ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
గత డిసెంబర్ లో 2 వేల 850 కోట్లు వెచ్చించి మెట్రో క్యాష్ & క్యారీ ఇండియాను రిలయన్స్ రిటైల్ వెంచర్స్ సొంతం చేసుకుంది. 31 హోల్ సేల్ స్టోర్లు, 6 స్టోర్ లొకేషన్లతో కూడిన రియల్ ఎస్టేట్ పోర్ట్ ఫోలియో కూడా డీల్ లో భాగంగా ఉంది. ఈ సేల్ మే 2023లో పూర్తయింది. అయితే ఈ కొనుగోలు అనంతరం మెట్రో AGకి RIL 254 కోట్లు చెల్లించింది.

జర్మన్ రిటైలర్ బ్రాండ్ పేరును భారత్ లో ఉపయోగించినందుకు సెప్టెబంరు 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికిగాను ఈ మొత్తం పే చేసినట్లు తెలుస్తోంది. 'కొత్త యజమాని వ్యాపార నిర్వహణకు వీలుగా మెట్రో AG కొన్ని ట్రాన్సిషన్ సేవలు మరియు లైసెన్సులను అందిస్తోంది. ఇందుకోసం 254 కోట్లను ముందస్తు చెల్లింపుగా స్వీకరించబడింది' అని మెట్రో తన వార్షిక నివేదికలో స్పష్టం చేసింది.
పెరుగుతున్న మార్కెట్ కన్సాలిడేషన్, వేగవంతమైన డిజిటలైజేషన్ మరియు తీవ్రమైన పోటీనే తన రిటైల్ బిజినెస్ విక్రయానికి కారణంగా మెట్రో పేర్కొంది. ఇండియాలో వ్యాపారం తన ప్రధాన వృద్ధి వ్యూహానికి అనుగుణంగా లేదని భావిస్తున్నట్లు చెప్పింది. లావాదేవీ ఖర్చులతో సహా ఈ డీల్ ద్వారా 1,363 కోట్లు ఆదాయం వచ్చినట్లు వెల్లడించింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications