Ambani News: వారంలో కొడుకు పెళ్లి ఖర్చుకు 5 రెట్లు లాభం కొట్టేసిన అంబానీ
Mukesh Ambani: భారత్‌లో నెంబర్‌వన్ ధనవంతుడైన ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహం గత వారం జరిగింది. పెళ్లై వారం రోజులు కావస్తున్నా.. పెళ్లికి అంబానీ ఫ్యామిలీ చేసిన ఖర్చుపై యావత్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్ద స్థాయిలో చర్చకు దారితీసింది. గతంలో అంబానీ కుటుంబంలో అన్ని వివాహ వేడుకల కంటే కూడా ఈసారి చర్చ కొనసాగుతోంది.
వాస్తవానికి కుటుంబంలో చిన్న కొడుకు కావడంతో అంబానీ కుటుంబం అనంత్ పెళ్లిని పెద్ద గ్రాండ్ వెడ్డింగ్ ట్రీట్‌లా నిర్వహించింది. దాదాపు అనేక నెలలుగా కొనసాగిన ప్రీవెడ్డింగ్ ఈవెంట్స్ తర్వాత.. ముంబైలోని జియో సెంటర్‌లో మూడు రోజుల పాటు వివాహ వేడుకలు జరిగాయి. ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖులు అతిథులుగా కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత కళాకారుల తమ కచేరీ కూడా నిర్వహించారు.

అనంత్ అంబానీని అభినందించడానికి ప్రపంచంలోని చాలా మంది సంపన్నులు వచ్చారు. బిల్ గేట్స్, మార్క్ జుకర్‌బర్గ్, భారతీయ సినీ ప్రముఖుల జాబితా ఇందులో ఉంది. ఈ పెళ్లికి ముకేశ్ అంబానీ, నీతా అంబానీ రూ.5 వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇది అంబానీ మొత్తం ఆస్తుల్లో కేవలం 0.5% శాతం మాత్రమే. అయితే కేవలం ఒక్క వారం రోజుల్లోనే ఆయన ఆస్తి విలువ వేల కోట్లు పెరిగిపోయింది. ప్రస్తుతం అంబానీ నికర విలువ భారత కరెన్సీ ప్రకారం రూ.10 లక్షల కోట్లుగా ఉంది.
జూలై 5న ముఖేష్ అంబానీ నికర విలువ 118 బిలియన్ డాలర్లు కాగా, గత కొద్దిరోజులుగా అది 121 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ పెరుగుదల కారణంగా ముఖేష్ అంబానీ నెట్‌వర్త్ దాదాపు 25,000 కోట్ల రూపాయలు పెరిగింది. 2024 నుంచి ముఖేష్ అంబానీ నికర విలువ రూ.1.88 లక్షల కోట్లు పెరిగింది.


Click it and Unblock the Notifications